logo

  BREAKING NEWS

ఢిల్లీ రైతుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!  |   రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |  

మాస్ డైరెక్టర్ చేతికి రజనీకాంత్ బయోపిక్.. తలైవా పాత్రలో ఆ స్టార్ హీరో!

ప్రముఖుల జీవిత చరిత్రలను తెరపై చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన మహానటి సావిత్రి బయోపిక్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా మరో సూపర్ స్టార్ బయోపిక్ ట్రెండింగ్ లో ఉంది. ఓ సాధారణ బస్ కండక్టర్ నుంచి తమిళుల తలైవా గా ఎదిగాడు రజనీకాంత్. కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అపూర్వ రాగన్‌గల్‌’ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ భాషలతో పాటు పలు అమెరికన్ సినిమాల్లోనూ మెరిశారు. ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తి. సినిమా స్టోరీని తలపించే ఆయన లైఫ్ జర్నీ లో కమర్షియల్ సినిమాకు అవసరమయ్యే అన్ని ఎలెమెంట్స్ ఉన్నాయి. దీంతో రజని బయోపిక్ ను తెరకెక్కించాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై కోలివుడ్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా పేరున్న లింగు స్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన పందెం కోడి, ఆవారా సినిమాలు అటు తమిళులను ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమాను తెరకెక్కించే సన్నాహాలు మొదలు పెట్టాడు లింగుస్వామి. రెండేళ్లుగా ఈ దర్శకుడి నుంచి ఎలాంటి సినిమా ప్రకటన రాలేదు. దీంతో ఈ బయోపిక్ కు కథ సిద్ధం చేసే పనిలోనే ఉన్నదంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో రజనీ పాత్రలో కనిపించే హీరో ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

రజని పెద్దల్లుడు ధనుష్ ఈ రోల్ చేయబోతున్నటుగా సమాచారం. ఇటీవల లింగుస్వామి మాట్లాడుతూ తనకు రజని బయోపిక్ చేయాలనీ ఉందని తలైవా పాత్రలో ధనుష్ నటిస్తే బాగుంటుందని తన కోరికను బహిరంగంగానే ప్రకటించాడు. తలైవా స్టైల్, మ్యానరిజమ్స్ ను పెర్ఫెక్ట్ గా మ్యాచ్ చేయగలిగే నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది రజనీ అల్లుడు ధనుషే. సహజంగానే రజనీకి వీరాభిమాని అయిన ధనుష్ ఆయనను అనుకరించగలడు కూడా. దీంతో మామ పాత్రలో అల్లుడినే నటింపజేయాలని మూవీ మేకర్స్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రావలసి ఉంది.

Related News