logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

బాలయ్య- బోయపాటి సినిమాలో విలన్ గా స్టార్ కమెడియన్!

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న BB3 సినిమాకు సంబందించిన టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్ కు బాలయ్య అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన మరో ఆసక్తికర విషయం పై చర్చ జరుగుతుంది. బాలయ్య బోయపాటి సినిమా అంటే అభిమానుల అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే.

ఆ అంచనాలకు తగ్గట్టే సినిమాలో విలన్ పాత్ర కూడా డిజైన్ చేస్తాడు బోయపాటి. గతంలో జగపతి బాబు లాంటి కూల్ హరోను విలన్ గా చూపించి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు వీరి తాజా సినిమాలో విలన్ గా టాలీవుడ్ స్టార్ కమెడియన్ సునీల్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి. ఈ వార్త వినడానికి కొంచం కొత్తగా అనిపించినా బోయపాటి మేకింగ్ పై నమ్మకం ఉన్న అభిమానులు మాత్రం సాధ్యమే అంటున్నారు.

కమెడియన్ నుంచి హీరోగా మారి రెండో సినిమాకే సిక్స్ ప్యాక్ బాడీతో షాకిచ్చాడు సునీల్. మరి బాలయ్యను ఢీ కొట్టే పాత్రలో బోయపాటి సునీల్ ను ఏ విధంగా చూపిస్తాడో చూడాలి. ఈ పాత్ర కోసం సునీల్ కు భారీ పారితోషకం కూడా అఫర్ చేసారని తెలుస్తుంది. కమెడియన్ గా రోజుకు మూడు లక్షలకు పైగా తీసుకునే సునీల్ కి ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం అందుకు రెట్టింపు పారితోషకాన్ని ఇవ్వనున్నారట.

Related News