పదవతరగతి అర్హతతో మరో అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. తక్కువ విద్యార్హతలు ఉండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఈ ఏడాదికి సంబందించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. నాన్ టెక్నీకల్ విభాగంలో మల్టీ టాస్కింగ్ పోస్టుల భర్తీకి ఎస్ఎస్సి దరఖాస్తులు కోరుతుంది. ఈ నోటోఫికేషన్ ద్వారా ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర మంత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ పోస్టులను భర్తీ చేస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మార్చి 21 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక ( https://ssc.nic.in/) వెబ్సైట్లో చూడొచ్చు. అయితే ఖాళీలకు సంబందించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. గతంలో మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ (MTS) నోటిఫికేషన్ ద్వారా 9069 పోస్టుల్ని భర్తీ చేసింది. ఈసారి కూడా దాదాపు అంతే సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసే అవకాశముంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ (పదో తరగతి) పరీక్ష లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థుల వయసు 2021 జనవరి 1వ తేదీ నాటికీ 18-25 ఏళ్లు, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ యవసులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష ఉంటుంది. పేపర్ -1 లో కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష నిర్వహిస్తారు. టైపు 2 లో డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఈ రెండు పరీక్షల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. 2021 మర్చి 21 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. ఆన్ లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి మార్చి 23 చివరితేది.