logo

  BREAKING NEWS

మే 15 లోపు వాట్సాప్ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయకుంటే ఏమవుతుంది?  |   జ‌గ‌న్ – ష‌ర్మిల మ‌ధ్య విభేదాలు 100 % నిజం.. ఇదే సాక్ష్యం  |   శ‌త్రువులు కూడా ఈ విష‌యంలో జ‌గ‌న్‌ను శ‌భాష్ అంటారు  |   కరోనాను అడ్డుకునే అస్త్రం అదొక్కటే.. శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు  |   శుభవార్త: తగ్గిన బంగారం ధరలు 16.04.2021 బంగారం, వెండి ధరలు  |   కరోనా తీవ్ర ఇన్ఫెక్షన్ వీరిలోనే ఎక్కువ.. కారణం ఇదే  |   పెరిగిన బంగారం ధరలు 15.04.2021 బంగారం, వెండి ధరలు  |   బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |  

ఎస్ఎస్సీ నుంచి భారీ నోటిఫికేషన్.. పదో తరగతితో కానిస్టేబుల్ ఉద్యోగాలు!

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అదిరిపోయే శుభవార్త వినిపించింది. పదో తరగతి అర్హతతో కానిస్టేబుళ్ల నియామకానికి నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర సాయుధ పోలీసు బలగాలలోని (సీఏపీఎఫ్), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్ లో రైఫిల్ మెన్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీ ఉంటుంది.

అందుకోసం దాదాపు 50 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఈ నియూయమాకాలకు సంబంధించిన షెడ్యూల్ ను మార్చి 25 వ తేదీన విడుదల చేయనుంది. పదో తరగతి పాసైన వారు ఎవరైనా ఈ పరీక్షలు రాసేందుకు అర్హులు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మే 10వ తేదీన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది.

ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నునిర్వహిస్తారు. ఆ తర్వాత ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక ఇందుకు సంబందించిన అడ్మిట్ కార్డులను జులైలో విడుదల చేసే అవకాశం ఉంది. తక్కువ విద్యార్హతతో కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేయాలని భావిస్తున్న ఉద్యోగార్థులకు ఇదొక మంచి అవకాశం.

 

Related News