logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

పరీక్షలు లేకుండానే పదో తరగతి పాస్ చేస్తారా..?

కరోనా లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో జరగవలసిన పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆనాటి నుండి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ వీడటం లేదు. జూన్ మొదటి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీనిపై హై కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నిన్న విచారణ చేపట్టిన న్యాయస్థానం జిహెచ్ఎంసి మినహా అని జిల్లాలో పరీక్షలు నిర్వహించుకోవచ్చని తీర్పునిచ్చింది.

కోర్టు తీర్పుపై చర్చించిన విద్యాశాఖ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నటుగా జీవో జారీ చేసింది. రెండు సార్లు పరీక్షలను నిర్వహించడం వలన విద్యార్థులు గందరగోళానికి గురవుతారని వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పదో తరగతి పరీక్షలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో కరోనా కేసుల దృష్ట్యా పరీక్షలు రద్దు చేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. పరీక్షలు రద్దు చేసి అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. విద్యాశాఖ కూడా పరీక్షల రద్దు నిర్ణయానికే అనుకూలంగా ఉన్నట్టు సమాచారం.

Related News