ఈ ఏడాది విడుదలైన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్. సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ సినిమా పాటలకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు దూరమైన థమన్ ఈ సినిమాతో మళ్ళీ స్టార్ హీరోల సినిమాలతో బిజీ అయ్యాడు.
ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో పునీత్ రాజ్ కుమార్, విజయ్, మహేష్, పవన్ కళ్యాణ్ సినిమాలు ఉన్నాయి. ఈ జోష్ లోనే థమన్ రవితేజ ‘క్రాక్’ సినిమాతో మళ్ళీ తన మార్కు వేయడానికి సిద్దమయ్యాడు. అయితే ఇక్కడే కొత్త సమస్య మొదలైంది. గోపీచంద్ మలినేని- రవితేజ కాంబినేషన్లో తెరకెక్కతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే ‘బలేగా దొరికావే బంగారం’ అనే పాట విడుదలైంది.
ఈ పాటకు మాస్ మహారాజా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే నెటిజన్లు మాత్రం మరోసారి థమన్ ను వాడేసుకుంటున్నారు. అందుకు కారణం ఈ పాత ట్యూన్ ని కూడా గతంలో లాగానే థమన్ కాపీ కొట్టాడంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ పాత ట్యూన్ ను ఒరిజినల్ అయిన ‘సెల్వా ఎల్ నియాన్’ అనే ట్యూన్ నుంచి కాపీ కొత్తదంటున్నారు. అందుకు సంబందించిన లింక్ ను షేర్ చేస్తూ రచ్చ చేస్తునారు.
దీంతో లాటిన్ కు సంబందించిన ఈ ట్యూన్ ఒక్కసారిగా తెలుగులో ఫెమస్ అయ్యింది. దీంతో థమన్ కు మరోసారి కాపీ మరకలు అంటుకున్నట్టైంది. ప్రస్తుతం పై సోషల్ మీడియాలో ఇందుకు సంబందించిన మీమ్స్ పేలుతున్నాయి. గతంలో ట్యూన్ కాపీలపై వచ్చిన కామెంట్లపై థమన్ స్పందించిన వీడియోలను ఇప్పుడు మరోసారి షేర్ చేస్తున్నారు.