logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించేది ఆమేనా..?

పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో ఎవరిని చూపిస్తారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. రాజకీయాలతో బిజీగా మారిన పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ సినిమాతో వెండి తెరకు రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అయితే తాప్సి పాత్ర ఈ సినిమాలో కీలకం. ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారనే విషయం ఇంకా తెలియరాలేదు. కానీ వివిధ నటీమణుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా శృతి హాసన్ తాను వకీల్ సాబ్ లో ఉన్నానని చెప్పిన విషయం తెలిసిందే. కానీ తాప్సి పాత్రలో కాదని తెలుస్తుంది. ఆ విషయం మాత్రం రివీల్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టిందీ ముద్దుగుమ్మ.

తాజాగా టాలీవుడ్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. శృతి హాసన్ పవన్ కళ్యాణ్ భార్యగా నటించనుందని తెలుస్తుంది. పింక్ సినిమా తమిళ వెర్షన్ లో అజిత్ నటించిన విషయం తెలిసిందే. అజిత్ భార్య పాత్రలో విద్యాబాలన్ నటించి ఆకట్టుకుంది. ఈ ఎపిసోడ్ సినిమాలో చాలా తక్కువ సమయం ఉన్నా చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు తెలుగులో విద్యాబాలన్ పాత్రలో శృతిహాసన్ నటిస్తుందని సమాచారం.

Related News