logo

  BREAKING NEWS

ఢిల్లీ రైతుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!  |   రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |  

2023 ప్రపంచ కప్ ఆడటమే లక్ష్యంగా.. శ్రీశాంత్

మ్యాచ్ ఫిక్సింగ్ నేపథ్యంలో కొన్నేళ్లుగా నిషేదం ఎదుర్కుంటున్న టీమిండియా వివాదాస్పద పేసర్ శ్రీశాంత్ మరోసారి ఆటకు సిద్దమవుతున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ లో బీసీసీఐ నిషేధం ముగుస్తుండటంతో కేరళ తరఫున రంజీల్లో శ్రీశాంత్‌ను ఆడించాలని ఇప్పటికే కేరళ క్రికెట్ అసోషియేషన్ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ మాట్లాడుతూ… 2023 ప్రపంచ కప్ కు ఆడటమే తన లక్ష్యమని స్పష్టం చేసాడు.

ఇది వినడానికి ఆశ్చర్యం కలిగించినా ఇదే తన లక్ష్యమన్నాడు. తన ఆటపై తనకు పూర్తి నమ్మకముందని ధీమా వ్యక్తం చేసాడు. ఒకవేళ రంజీలో శ్రీశాంత్ స్థిరమైన ఆటను కొనసాగించగలిగితే ఇండియా-ఎ టీమ్‌కి ఆ తర్వాత భారత జట్టుకి ఎంపిక అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే ఏడేళ్లుగా ఆటకు దూరంగా ఉన్న శ్రీశాంత్ కు ఇది సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్త్తమవుతున్నాయి. భారత్ జట్టులో ప్రస్తుతం నెలకొన్న పోటీ కూడా ఈ అనుమానాలను బలపరుస్తుంది.

2013 ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు తరఫున ఆడుతూ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో దోషిగా తేలడంతో బీసీసీఐ ఏ స్థాయిలోనూ క్రికెట్‌ ఆడకుండా అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. కేరళ కోర్టును తీర్పును సవాలు చేస్తూ హై కోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా శ్రీశాంత్ కు నిరాశే ఎదురైంది. అనంతరం సుప్రీంలో కూడా పోరాటం చేసాడు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం శ్రీశాంత్ నిర్దోషి అని తేల్చకపోయినా బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాని తీర్పునిచ్చింది.

Related News