logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

జ‌గ‌న్ తెలంగాణ‌కు అన్యాయం చేస్తున్నారు: మంత్రి శ్రీనివాస్ ‌గౌడ్‌

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌ర్ సామ‌ర్థ్యం పెంచేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం జీవో తీసుకురావ‌డాన్ని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. అప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ తెలంగాణ‌కు అన్యాయం చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. అవ‌గాహ‌న లేని ఇంజ‌నీర్లు జ‌గ‌న్‌కు స‌ల‌హా ఇస్తున్నార‌ని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు క‌లిసి సామ‌ర‌స్యంగా నీటిని వినియోగించుకుందామ‌ని కేసీఆర్ చెబుతుంటే, ఏ మాత్రం సంప్ర‌దించ‌కుండా ఏపీ ప్ర‌భుత్వం జీవో తీసుకురావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు.

ఏపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీవో వ‌ల్ల ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆయ‌న వాపోయారు. ఎలాంటి అనుమ‌తులు తీసుకోకుండా ఏపీ ప్ర‌భుత్వం కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి జీవో విడుద‌ల చేయ‌డం స‌రికాద‌న్నారు. మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లా ప్ర‌జ‌లు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లో ఏపీ ప్ర‌భుత్వం నిర్మించాల‌నుకుంటున్న ప్రాజెక్టును అడ్డుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

Related News