logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

శ్రీదేవి అభిమానులకు పండగే.. ఆ సూపర్ హిట్ సినిమా మళ్ళీ వస్తుంది!

భారతీయ సినీ పరిశ్రమలో దిగ్గజ నటులుగా పేరు పొందిన నటులు కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి. వీరి కాంబినేషన్ లో నాలుగు దశాబ్దాల క్రితం ఓ సూపర్ హిట్ సినిమా వచ్చింది. అదే ‘పదినారు వయదినిలే’. తమిళ్ లో సంచలన విజయం సాధించిన ఈ సినిమాను దర్శకేంద్రుడు కె. రాఘవేందర్ రావు తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’ సినిమాగా రీమేక్ చేసారు. తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలు రాయిగా ఈ సినిమా గుర్తుండిపోయింది.

ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ సినిమాను అధునాత పద్దతుల ద్వారా డాల్బీ సౌండ్ వినియోగించి తెలుగు లోకి అనువాదం చేసారు. ‘నీకోసం నిరీక్షణ’ పేరుతో సోషల్ మీడియా వేదికగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. మరో ఐదు భాషల్లోకి కూడా సినిమాను డబ్ చేయబోతున్నామని సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది.

ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ ద్వారా సినిమాలోని ఐదు పాటలను విడుదల చేసాము. వాటికీ మంచి స్పందన వస్తుంది. తమిళ మాతృక లోని 30 నిమిషాల సినిమాను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఎడిట్ చేసాము. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను అని నిర్మాత భామ రాజ్ కణ్ణు తెలిపారు. ఈ సినిమాకు పనిచేసినందుకు గాను ఉత్తమ నటుడిగా కమల్ హాసన్, ఉత్తమ దర్శకుడిగా భారతీ రాజా, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయ రాజా, ఉత్తమ నేపథ్య గాయనిగా ఎస్. జానకి లను జాతీయ అవార్డులు వరించాయి.

Related News