logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

‘గాలి సంపత్’ మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా ‘గాలి సంపత్’. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం ఒకరు శ్రీ విష్ణు అయితే మరొకరు దర్శకుడు అనిల్ రావిపూడి. గాలి సంపత్ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేసిన అనిల్, మాటలు, స్క్రీన్ ప్లే కూడా అందించారు. దీంతో సహజంగానే ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. శివరాత్రి సందర్భంగా విడుదలైన సినిమాలలో గాలి సంపత్ కూడా ఒకటి. మరి ఈ గాలి సంపత్ కథేంటో రివ్యూలో తెలుసుకుందాం..

కథ:
గాలి సంపత్ గా రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తారు. ఓ ప్రమాదం కారణంగా నోటి మాట కోల్పోతాడు. పదాలు సరిగ్గా పలకకపోవడంతో తనకు ఎంతో ఇష్టమైన రంగస్థల నాటకాలకు దూరమవుతారు. తనకు వచ్చిన ఫీ ఫీ బాషలోనే మాట్లాడుతుంటాడు. పక్కన ట్రాన్స్ లెటర్ గా కమెడియన్ సత్య కనిపిస్తాడు. గాలి సంపత్ కొడుకే శ్రీ విష్ణు. అరకులో ట్రక్ డ్రైవర్. ఎప్పటికైనా ఓ ట్రక్కు కొనాలనేది అతని కల. ఇద్దరిదీ చెరో దారి అన్నట్టుగా ఉంటారు. ఈ క్రమంలో తండ్రీ కొడుకుల మధ్య చిన్న చిన్న తగాదాలు జరుగుతుంటాయి. ఓరోజు ట్రక్కు కోసం కొడుకు దాచుకున్న డబ్బును గాలి సంపత్ నాటకాల కోసం వాడేస్తాడు. ఈ క్రమంలో తండ్రి కొడుకుల మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. అదే సమయంలో ఇంటి ముందున్న 30 అడుగుల గోతిలో పడిపోతాడు గాలి సంపత్. మాటలు రాని అతను గోతిలో నుంచి ఎలా బయట పడతాడు? తండ్రి ఆచూకీ కనిపెట్టడం కోసం హీరో ఏం చేస్తాడు? అసలు ఈ గాలి సంపత్ ఎవరు అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అనేదే సినిమాలో కథ.

విశ్లేషణ:
ఈ సినిమాలో ప్రధాన పాత్రలు సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తారు. అయితే కథ మొత్తం అయన చుట్టూనే తిరుగుతుంది. శ్రీ విష్ణు ఆయన కొడుకు పాత్రలో కనిపిస్తాడు. మొదట కొన్ని సన్నివేశాలలో రాజేంద్రప్రసాద్ ఫీ ఫీ భాషలో మాట్లాడటం చూసి సినిమా మొతం ఇంతేనా అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఆ తర్వాత మాత్రం రాజేంద్ర ప్రసాద్ నట విశ్వరూపాన్ని చూపిస్తారు. సినిమాలో మొట్టమొదట మాట్లాడుకునే అంశం కూడా ఇదే. మాటలు లేకపోయినా హవ భావాలతో ఆయన మ్యాజిక్ చేసారు. ఇక సినిమా విషయానికొస్తే తండ్రీ కొడుకులుగా శ్రీ విష్షు, రాజేద్రప్రసాద్ ఒదిగిపోయారు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఆకట్టుకుంటుంది. సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు కీలకంగా ఉంటాయి.

రాజేంద్రప్రసాద్ నూతిలో పడిపోవడం అందులో నుంచి బయటకు రావడానికి చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉండి నవ్వు తెప్పిస్తాయి. కొన్నిచోట్ల గుండె బరువెక్కుతుంది. అనిల్ రావి పూడి మార్కు ను ఈ సినిమాలో ఎక్స్ పెక్ట్ చేయలేము. అక్కడక్కడా థ్రిల్లింగ్ అంశాలు ఆకట్టుకుంటాయి. కొత్త దర్శకుడైనా అనీష్ సినిమాకు పూర్తి న్యాయం చేసాడు. సినిమాలో పాటల కన్నా ఆర్ ఆర్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. పాత కథే అయినా బాగానే చూపించారు. కమెడియన్స్ గా శ్రీనివాస రెడ్డి, సత్య బాగా నవ్వించారు. హీరోయిన్ గా లవ్లీ సింగ్ కు అంత ప్రాధాన్యం లేకపోయినా ఉన్నతలో అందంగా అకనిపించి మెప్పించింది. క్లైమాక్స్ తో దర్శకుడు సినిమాను ఆసక్తికరంగా అమర్చాడు.

ప్లస్ పాయింట్స్:
గాలి సంపత్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ నటన, ఫస్ట్ హాఫ్ కామెడీ, క్లైమాక్స్ సన్నివేశాలు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్:
పాత కథనం, సెకండ్ హాఫ్ లో నెమ్మదించే కొన్ని సన్నివేశాలు సినిమాకు మైనస్ పాయింట్స్ గా నిలిచాయనే చెప్పాలి.

రేటింగ్:
ఫైనల్ గా గాలి సంపత్ సినిమాకు 2.5/5 రేటింగ్ ఇవ్వచ్చు.
.

Related News