logo

  BREAKING NEWS

రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |  

పవన్ కళ్యాణ్ పై ‘నగ్నం’ హీరోయిన్ కామెంట్స్

రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన హీరోయిన్లంతా ఇప్పుడు టాప్ రేంజ్ లో ఉన్నవారే. నటుల్లోని టాలెంట్ ను వెలికితీయడంతో వర్మ సిద్ధహస్తుడు. వర్మ సినిమాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ‘నగ్నం’ సినిమాతో మరో అందాన్నిఆయన తెరపైకి తెచ్చారు. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో డిజైనర్ గా ఉన్న శ్రీ రాపాక ను నగ్నం సినిమాతో సెలెబ్రిటీని చేసేసాడు. ఇప్పుడామెను అందరూ వర్మ గారి స్వీటీ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు.

అయితే ఈ సినిమా విజయంతో శ్రీ రాపాక సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. తన గురించి తాను చెప్పుకుంటూ మధ్య మధ్యలో టాలీవుడ్ హీరోల గురించి ఆమె చేస్తున్న కామెంట్లు ఆసక్తికరంగా ఉంటున్నాయి. కాగా ఇటీవల శ్రీ రాపాక బాలకృష్ణ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆమె కొన్ని ఘాటు వ్యాఖ్యలే చేసింది. అదేమిటంటే. ఆమెకు ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన క్రష్ ఉందట.

మూడు సార్లు ఆయనను కలవాలని ప్రయత్నించానని, అయితే ఎప్పుడు వీలుపడలేదని తెలిపింది. అయితే అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ తో డేటింగ్ కు వెళ్ళడానికి కూడా సిద్ధమని స్టేట్ మెంట్ ఇచ్చేస్తుంది. ఆయన ఒకే అనాలే గాని తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. అయితే తాను పవన్ కళ్యాణ్ ను కలవడానికి ఎవ్వర్నీ సంప్రదించడం ఇష్టం లేదట. కావాలనుకుంటే తానే నేరుగా వెళ్లిపోతానని వ్యాఖ్యలు చేసింది.

Related News