logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

హైదరాబాద్ లో నిజాం ప్రతిష్టించిన సీతారాములు.. ఎక్కడున్నారో తెలుసా?

భద్రాచలం రాముడి కల్యాణానికి హైదరాబాద్ రాజ్యం నుంచి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు వెళ్లడం అనేది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. కుతుబ్ షాహీల కాలంలో మొదలైన ఈ సంప్రదాయాన్ని నిజాం పాలకులు కూడా కొనసాగిస్తూ వచ్చారు. పరిమతసహనానికి హైదరాబాద్ ప్రతీకగా ఉండేదని ఈ సంఘటనలు తెలియజేస్తుంటాయి.

అయితే హైదరాబాద్ లో నిజాం చేతుల మీదుగా ప్రతిష్టించబడిన సీతారాముల ఆలయం ఒకటి ఉందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అదే రాంబాగ్ శ్రీరామాలయం. మూడో నిజాం అక్బర్ అలీ ఖాన్ హయాంలో హైదరాబాద్ సంస్థానంలో రాజా భవానీ పర్షాద్ ఉన్నత ఉద్యోగిగా ఉండేవారు. దురదృష్టవశాత్తు ఆయన చేతికందిన కొడుకుని పోగొట్టుకోవలసి వచ్చింది.

కుమారుడి మరణంతో కుంగిపోయిన ఆయన అత్తాపూర్ లో ఓ రామాలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు. 10 ఎకరాల భూమిని సేకరించి ఆలయ నిర్మాణం చేపట్టాడు. గద్వాల్‌ సంస్థానం నుంచి సీతారామ, లక్ష్మణ విగ్రహాలను తెప్పించాడు. రామ భక్తుడైనప్పటికీ విగ్రహ ప్రతిష్టాపనను అప్పటి నిజాం మీర్ అక్బర్ అలీ ఖాన్ (సికిందర్ ఝా) చేతుల మీదుగా చేయించాలని అనుకున్నాడు.

ఆ విధంగా 1812లో రాంబాగ్ ఆలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలను నిజాం ప్రతిష్టించాడు. అలాగే ఆలయంలో పూజ కైంకర్యాలు కోసం 50ఎకరాల భూమిని కూడా రాసిచ్చారు. నిజాం ఏటా శ్రీరామనవమినాడు రామచంద్రుడికి పట్టువస్త్రాలు సమర్చించే వాడు. అమూల్యమైన ఆభరణాలను కూడా చేయించాడు. ఈ ఆలయం హైదరాబాద్ లో విభిన్న సంస్కృతుల కలయికను తెలియజేస్తుంది.

Related News