టాలీవుడ్ గేయ రచయిత శ్రీమణి ప్రేమ వివాహం చేసుకున్నారు. పదేళ్ల పాటు ప్రేమించిన ఫరా ను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా అయన దేవుడికి, తమను అర్థం చేసుకుని ఆశీర్వదించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు అయన తన పెళ్లి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
శ్రీ మణికి సినీ రంగాల వారి నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ శ్రీ మణిని ఉద్దేశిస్తూ ఓ చిలిపి కామెంట్ చేసారు. ఇన్నాళ్లు మీ రోంటిక్ లిరిక్స్ వెనకాల ఉన్న సీక్రెట్ ఇదా ఇప్పుడు అర్థమయ్యింది అన్నారు. కాగా ఇటీవల ‘ఉప్పెన’ సినిమాలో శ్రీమణి రాసిన ‘నీ కళ్ళు నీలి సముద్రం’ పాట విడుదలై సంచలనంగా మారిన విషయం తెలిసిందే.