logo

  BREAKING NEWS

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |   అసెంబ్లీలో రగడ: చంద్రబాబు సహా టీడీపీ సభ్యుల సస్పెండ్!  |   కరోనా పుట్టింది ఎక్కడో కాదు భారత్ లోనే..? చైనా సంచలన ఆరోపణలు!  |   అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |  

ఉల్లికాడల్లో ఉండే పోషకాల గురించి తెలిస్తే వీటిని అశ్రద్ధ చేయరు

తక్కువ ఘాటుతో ఉండే ఉల్లి కాడలను సాధారణంగా ఉల్లికి ప్రత్యామ్న్యాయంగా వాడుతుంటారు. ఉల్లి ధరలు పెరిగినప్పుడు తప్ప మాములు సమయాల్లో వీటిని కొనడానికి అంతగా ఆసక్తి చూపారు. కానీ ఉల్లి కాడల్లో ఉండే పోషకాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. చైనీయులు వీటిని వివిధ అనారోగ్యాలను తరిమికొట్టే సంప్రదాయ ఔషధాలలో వాడుతుంటారు. వీటిని అన్ని రకాల వంటల్లో వేసి వండుకోవడం అలవాటు చేసుకోవాలి. పోషకాలు ఉండే ఆహార పదార్థాలను గురించి అడిగితే న్యూట్రీషన్లు ముందుగా ఇచ్చే సలహా ఇదే. ముందుగా వీటిలో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం..

ఉల్లికాడలలో విటమిన్ C, విటమిన్ B2, థయామిన్ లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ A, విటమిన్ K ని కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇవి కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం, మాంగనీసు, ఫైబర్ కు మంచి మూలం. ఉల్లిలో ఉన్నట్టుగానే వీటిలో కూడా సల్ఫర్ అధికంగా ఉంటుంది. సల్ఫేర్ తగిన మోతాదులో శరీరానికి అందితే ఎన్నో అనారోగ్యాలకు కారణమయ్యే వాటితో పోరాడి శరీరానికి రక్షణగా ఉంటుంది.

ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. కాలేయం చుట్టూ పేరుకున్న అధిక కొవ్వు తగ్గేలా చూస్తాయి. ఉల్లి కాడల్లో ఉండే కెమోఫెరాల్‌ అనే ఫ్లవనాయిడ్‌ రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా, రక్తం సాఫీగా సరఫరా అయ్యేట్టు చూస్తుంది. ఉల్లికాడలను ఎక్కువగా వాడితే రక్తపోటు, ఆస్టియోపోరోసిస్‌ వంటి ఎముక సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.

గుండె రక్త నాళాలకు మేలు చేసే ఉల్లి కాడలు కొలెస్ట్రాలను తగ్గించి గుండెకు ఆక్సిజన్ లెవెల్స్ ను అందించడంలో సహాయపడుతుంది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకునే వారిలో గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే క్రోమియం బ్లడ్ ప్రెజర్ ను తగ్గించే విధంగా ఉపయోగపడుతుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది. గ్లూకోజ్ శక్తిని పెంచుతుంది. ఉల్లి కాడల్లో ఉండే ఆంటీ బాక్టీరియల్ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడుతుంది.

జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ కూరగాయలోని విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వైరస్ ల నుండి కాపాడుతుంది. వీటిలో ఉండే పెక్టిన్(pectin) అనే గుణం కారణంగా పెద్ద పేగు క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, ఉబ్బసం వ్యాధితో బాధపడేవారు కచ్చితంగా ఉల్లి కాడలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

చర్మంపై ముడుతలతో బాధపడేవారికి ఇదొక చౌకైన పరిష్కారం. ఇందులో ఉండే అల్లాసిన్ ముడతలను రానివ్వదు. కళ్ల జబ్బులు, కంటి చూపు సమస్యతో బాధపడేవారికి కూడా ఇది చక్కని పరిష్కారంగా వైద్యులు సూచిస్తున్నారు.

Related News