logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

విస్తుపోయే నిజాలు: పురుషుల్లో తగ్గుతున్న ఆ సామర్థ్యం.. కారణం ఇదేనట!

పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లలకోసం సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్నవారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతుంది. కొత్తగా పెళ్ళైన యువతలో అత్యధికంగా ఎదుర్కుంటున్న సమస్య స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం. అంటే సంతానోత్పత్తికి అవసరమయ్యే వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటంతో పిల్లల కోసం ఏండ్లకు ఏండ్లు ఎదురుచూడాల్సి వస్తుంది. ఫలితంగా శరీరం సహజసిద్ధంగా ఉత్పత్తి చేయాల్సిన వీర్య కణాలను మందుల ద్వారా వృద్ధి చేసుకుంటున్నారు.

అయితే ఇలా ఉన్నట్టుండి పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు రావడానికి కారణాలు ఏమిటనే విషయంపై ఓ సంస్థ అధ్యయనం చేపట్టింది. ఈ సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా పురుషులు ఎదుర్కుంటున్న ఈ సమస్యకు అసలు కారణం రసాయనాల వాడకమేనట. తాగే నీళ్ల దగ్గరి నుంచి తినే ఆహార పదార్థాల ప్యాకింగ్ వరకు ప్రతీ దాంట్లో ప్లాస్టిక్ వినియోగం ఉంటుంది. మనం రోజు వినియోగించే సబ్బులు, షాంపూలలో ఉండే రసాయనాలు కూడా పురుషుల సామర్థ్యాన్ని తగ్గించేస్తున్నాయట. అంతేకాదు పురుషాంగ పరిమాణనాన్ని కూడా కుంచించుకుపోయేలా చేస్తున్నాయని తెలిపింది.

వీటిలో ఉండే ‘పీఎఫ్ఎస్ఎఏ’గా పిలిచే రసాయనాలు ఎప్పటికీ శరీరంలో నిలిచిపోయే ఉంటాయని వాటి వల్ల హార్మోన్ల అసమతుల్యత పెరుగుతుందని అంటున్నారు. కౌంట్ డౌన్ పేరుతో విడుదల చేసిన ఓ పుస్తకంలో ఈ విషయాలను వెల్లడించారు. ఇందులో తెలిపిన వివరాల ప్రకారం.. 1973తో పోలిస్తే ఇప్పటి పురుషుల్లో 60 శాతం మేర వీర్య కణాల సంఖ్య తగ్గిపోయిందని వెల్లడించింది. ఒక కుటుంబంలోని ముత్తాత తో పోలిస్తే యువకుల సామర్థ్యం సగానికి తగ్గిందట. అలాగే యువతులు తమ పూర్వీకులతో పోలిస్తే 35 ఏళ్లకే గర్భం ధరించే శక్తిని కోల్పోతున్నారట.

అందుకే ఈ రసాయనాలను కొన్ని దేశాలు పూర్తిగా నిషేధించాయి. మరికొన్ని దేశాల్లలో ఇప్పుడిప్పుడే చర్యలు మొదలయ్యాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం ఈ పరిస్థితులను లెక్క చేయకపోవడం గమనార్హం. ఇవే పరిస్థితులు మరికొంత కాలం కొనసాగితే 2045 సంవత్సరం నాటికి పురుషుల్లో వీర్య కణాల సంఖ్య సున్నాకు పడిపోయే ప్రమాదం ఉందని, అప్పుడు భూమిపై ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంతమైనా ఆశ్చర్యం లేదని ఈ అధ్యయనం తెలిపింది. అందుకే ఇప్పటి నుంచైనా ప్లాస్టిక్, రసాయనాలు కలిపిన ఉత్పత్తులకు దూరంగా ఉండటమే బెటర్.

Related News