logo

  BREAKING NEWS

మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |   క‌రోనా వ్యాక్సిన్ కావాలంటే బీజేపీకే ఓటేయాలా ?  |   గుడ్ న్యూస్: వ్యాక్సిన్ రిలీజ్ డేట్ చెప్పేసిన భార‌త్ బ‌యోటెక్‌  |   మీ పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ స్థాయి హాస్ట‌ల్‌తో కూడిన‌ విద్య కావాలా  |   RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |  

టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే

ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం బ‌హుముఖ ప్ర‌జ్ఞాశీలి. గాయ‌కుడిగా, డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా, న‌టుడిగా, సంగీత ద‌ర్శ‌కుడిగా భార‌తీయ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. సినిమాల్లో సుమారు 40 వేల పాట‌లు పాటిన దిగ్గ‌జ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. అయితే, చాలా మందికి తెలియ‌ని విష‌య‌మేంటంటే బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ప‌లు రాజ‌కీయ పాట‌లు కూడా పాడారు. ఆయ‌న ఎప్పుడూ రాజ‌కీయాల జోలికి వెళ్ల‌రు.

రాజ‌కీయాల‌కు అతీతంగా ఆయ‌న గాత్రానికి అభిమానులు ఉంటారు. కానీ, ప‌లువురి విజ్ఞ‌ప్తి మేర‌కు కొన్నిసార్లు ఆయ‌న రాజ‌కీయ పార్టీల‌కు సంబంధించిన పాట‌లు కూడా పాడారు. బాలు పాడిన సినిమా పాట‌లే కాదు రాజ‌కీయ పాట‌లు కూడా ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేరు. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రెండు ప్ర‌ధాన పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల కార్య‌క‌ర్త‌ల‌ను ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం పాడిన రెండు పాట‌లు ఇప్ప‌టికీ ఉర్రూత‌లూగిస్తాయి. ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల మొబైల్ ఫోన్‌ల‌లో కాల‌ర్‌ట్యూన్‌, రింగ్‌టోన్‌గా ఉంటాయి.

ఒక ర‌కంగా చెప్పాలంటే ఈ పాట‌లే ఈ రెండు పార్టీల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాయి. ముందుగా ఆయ‌న దివంగ‌త ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన‌ప్పుడు ఆయ‌న విజ్ఞ‌ప్తి మేర‌కు ఒక పాట పాడారు. క‌ద‌లిరండి తెలుగుదేశ కార్య‌క‌ర్త‌లారా.. అంటూ సాగే ఈ పాట ఇప్ప‌టికీ టీడీపీ క్యాడ‌ర్ ఎంత‌గానో ఇష్ట‌ప‌డే పాట‌. తెలుగుదేశం పార్టీ ప్ర‌జ‌ల్లోకి వేగంగా వెళ్ల‌డానికి, టీడీపీ క్యాడ‌ర్‌లో ఒక జోష్ తీసుకురావ‌డానికి ఈ పాట బాగా ఉప‌యోగ‌ప‌డింది. ఇప్ప‌టికీ టీడీపీ కార్య‌క్ర‌మాల్లో ఈ పాట వినిపిస్తూ ఉంటుంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఒక పాట పాడారు. కాంగ్రెస్‌ను వీడి వైసీపీని స్థాపించిన త‌ర్వాత మొట్ట‌మొద‌టి వైసీపీ పాట‌ను పాడింది ఆయ‌నే. జ‌నం కోసం జ‌గ‌న్ ఎత్తిన జెండా వైఎస్సార్‌.. అంటూ ఈ పాట సాగుతుంది. వైసీపీకి ప్ర‌జ‌ల్లో ఒక గుర్తింపు రావ‌డానికి, పార్టీ ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డానికి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం పాడిన ఈ పాట ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింది. ఈ రెండు పాట‌ల త‌ర్వాత టీడీపీ, వైసీపీవి ఎన్నో పాట‌లు వ‌చ్చాయి కానీ బాలు పాడిన ఈ రెండు పాట‌ల‌కు మాత్రం ప్ర‌త్యేక స్థానం ఉంటుంది.

Related News