logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బ్రేకింగ్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్!

కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు కరోనా భారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని కూడా కరోనా వణికిస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి, తేజ, గాయని స్మిత వంటి సినీ సెలబ్రిటీలకు, మరికొందరు నటులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. మరోవైపు నటుడు పృథ్వీ కూడా కరోనా చికిత్స తీసుకుంటున్నారు.

తాజాగా లెజండరీ సింగర్, గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం ఈ మహమ్మారి భారిన పడ్డారు. దీంతో ఆయనను చెన్నై లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని బాల సుబ్రహ్మణ్యం ఓ వీడియో ద్వారా వెల్లడించారు. రెండు రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా కరోనా పరీక్షలు నిర్వహించారని దీనిలో తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలిందన్నారు.

అయితే తనకు తీవ్రమైన లక్షణాలు ఏమీ లేవని ఎవ్వరూ తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దన్నారు. అయితే తనకు విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలపడం వల్ల ఆసుపత్రిలో చేరనున్నారు. తన ఆరోగ్యం కోసం ఎవ్వరూ తనకు ఫోన్లు చేయవద్దని కోరారు.

Related News