logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

దక్షిణాది సినీపెద్దల పరువు తీసేసిన బుట్టబొమ్మ.. పూజ వ్యాఖ్యలపై దుమారం

‘ముకుందా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ పూజ హేగ్దే. కెరీర్ బిగినింగ్ లో వరుస అపజయాలతో సతమతమైన పూజను దక్షిణాది ప్రేక్షకులే ఆదరించారని చెప్పడంలో సందేహం లేదు. ఏ భాషలో లేనంత గుర్తింపు తెలుగు సినిమాల ద్వారానే దక్కించుకుంది పూజ. బాలీవుడ్ లో ఏకంగా హ్రితిక్ రోషన్ తో సినిమా చేసినా ఆమెను అక్కడి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు పట్టించుకోలేదు. దీంతో టాలీవుడ్ లో అడుగు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వరుసగా అల్లు అర్జున్, ప్రభాస్ వంటి బడా స్టార్లతో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కానీ ఇప్పుడు పూజా దక్షిణాది సినిమాపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

జాతీయా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ దక్షిణాది వాళ్లకు హీరోయిన్ల నడుమంటే వ్యామోహమని, మమ్మల్ని కురచ దుస్తుల్లో చూడటానికే వాళ్ళు ఇష్టపడతారని చెప్పి సినీ పెద్దల పరువు తీసేసింది. పూజ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పూజ పై దక్షిణాది ప్రేక్షకులు మండిపడుతున్నారు. పిలిచి అవకాశాలు ఇచ్చిన ఇండస్ట్రీపైనే ఇలాంటి కామెంట్లు చేస్తావా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంతటి గురింపునిచ్చిన ఇండస్ట్రీపై విమర్శలు చేసే బదులు బాలీవుడ్ లోనే సినిమాలు చేసుకోవచ్చు కదా అంటూ ఆమెకు సలహాలు ఇస్తున్నారు.

అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు నటిస్తున్నావ్ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేసుకోవచ్చు కదా అయినా బాలీవుడ్ లో నువ్వేమైనా సంప్రదాయమైన పాత్రలే చేసావా అంటూ ప్రశ్నిస్తున్నారు. దక్షిణాది సినిమాల్లో సినీ హీరోయిన్లకు అంతగా స్క్రీన్ స్పేస్ ఉండదనే విమర్శలు ఉన్నాయి. కానీ ఇక్కడ నటించే హీరోయిన్లకు స్టార్ హీరోలతో సమానంగా అభిమానులు ఉంటారు. సినీ కెరీర్ ముగిసిపోయినా వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. మరి పూజకు మాత్రం ఇవేమీ కనిపించలేదేమో. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఏకంగా ఆమె కెరీర్ కె నష్టం కలిగించేలా ఉన్నాయి.

ఎందుకంటే గతంలో తాప్సి, రాధికా ఆప్టే వంటి ఉత్తరాది హీరోయిన్లు కూడా మన సినిమాలపై ఇలాంటి విమర్శలే చేశారు. ఆ తర్వాత దక్షిణాది సినిమాల్లో కనుమరుగయ్యారు. అడపా దడపా సినిమాలు చేసినా అంతగా ఆడలేదు. సౌత్ లో కెరీర్ పీక్స్ స్టేజ్ లో ఉన్నటైం లో పూజా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇరుక్కోవడం ఆమె అభిమానులను కలవరపెడుతుంది. ఈ కాంట్రవర్సీపై పూజా ఇంకా స్పందించలేదు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో పూజ కామెంట్ల వేడి ఇప్పట్లో చల్లారేలా లేదు. ఇప్పటికే ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

Related News