logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

దక్షిణాది అమర్ నాథ్ యాత్ర మన దగ్గరే ఉంది

ప్రపంచంలోనే అమర్ నాథ్ యాత్ర ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే అచ్చం ఇలాంటి యాత్రే మన దక్షణ భారతదేశంలో కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. అదే నల్లమల్ల అడవుల్లోని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఉన్న సలేశ్వరం. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని అడవుల్లో వెలిసిన ఈ శైవ క్షేతాన్ని ఎంతో పవిత్రమైనదిగా, శక్తివంతమైనదిగా భావిస్తారు.ఇక్కడ శివుడు సలేశ్వరం లింగమయ్యగా పూజలు అందుకుంటాడు. సలేశ్వరం ఆలయం చుట్టూ ఎన్నో వింతలు విశేషాలు అలుముకుని ఉన్నాయి. ఈ యాత్ర చేసిన భక్తులు జీవితంలో మరిచిపోని అనుభూతుని పొందుతారని చెప్తారు. కానీ ఈ ఆలయానికి చేరుకోవాలంటే పెద్ద సాహసమే చేయాల్సి ఉంటుంది.

అందుకే సలేశ్వరాన్ని దక్షిణాది అమర్ నాథ్ యాత్రగా చెప్తారు. మన దేశంలో ఎలాంటి ఆలయమైనా దానికి ఒక స్థలపురాణం ఉంటుంది. కానీ సలేశ్వరం ఆలయం ఎప్పటిదో ఎవ్వరూ చెప్పలేరు. ఈ ఆలయానికి సంబందించిన చరిత్ర తెలిసిన వారు ఎవ్వరూ లేరు. పురాణం కాలం నుంచే సలేశ్వరం ఆలయం ఉన్నట్టుగా మాత్రం తెలుస్తుంది. ఇక్కడ నివసించే ఆదివాసీలు చేప్పే వివరాల ప్రకారం వారి పూర్వికులు సుమారు 500 శతాబ్దాల కిందట ఈ ఆలయాన్ని కనుగొన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఆలయంలో ఆదీవాసీలే పూజారులుగా అంటారు. సలేశ్వరంలో వెలసిన లింగమయ్యని చేతితో తాకినప్పుడు కదులుతున్నట్టుగా అనిపించడం ఈ ఆలయం విశిష్టత.

300 అడుగుల ఎత్తులో ఎత్తైన కొండలు, సెలయేళ్ళ మధ్యన ఉండే ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే దట్టమైన నల్లమల్ల అడవులను దాటుకుంటూ వెళ్లాల్సిందే. అడవుల్లో ఈ ప్రయాణం ఎన్నో మధురమైన అనుభూతులను ఇస్తుంది. భక్తులతో పాటుగా ప్రకృతి ఆరాదీకులు, సాహసికులు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ఉవిళ్లూరుతుంటారు. ఎత్తైన కొండలు, ఆ వెంటనే లోయలు ప్రకృతి సోయగాలతో కూడుకున్న ఈ యాత్ర ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. అనేక రకాల వన్య ప్రాణులు, అరుదైన పక్షులు దారిపొడవునా కనిపిస్తాయి. సలేశ్వరం యాత్ర ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతాయి. దాదయో 35 కిలోమీటర్ల మేర దట్టమైన అడవిలో కొండలు, గుట్టలు దాటుకుంటూ ప్రయాణం సాగించవలసి ఉంటుంది.

అందులో 3 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించవలసి ఉంటుంది. ప్రతి ఏడాది శుద్ధ చైత్ర పౌర్ణమిని ఇక్కడి ఆదివాసీలు ఎంతో పవిత్రగా భావిస్తారు. ఆ రోజున ఆలయం ముందున్న గుండంలో చంద్రకాంతి పడుతుంది. ఆరోజున ఈ గుండంలో స్నానం ఆచరిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇక్కడ 280 అడుగుల పైనుంచి జాలువారే జలపాతం భక్తులకు కనువిందు చేస్తుంటుంది. అయితే ఈ జలపాతం ఎక్కడి నుంచి వస్తుందనే ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. మండు వేసవిలో సైతం ఈ జలపాతం ప్రవహిస్తూనే ఉంటుంది. భక్తులు పెరుగుతున్న కొద్దీ జలపాతం మరింత పెరుగుతుందని ఆదివాసీల నమ్మకం.

Related News