బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురైనట్టుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయన కలకత్తాలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మూడు వరాల క్రితం సౌరవ్ గంగూలీ ఓసారి గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. థ్రెడ్ మీల్ పై వర్కవుట్లు చేస్తున్న సమయంలో అకస్మాతుగా ఛాతి నొప్పి, వాంతులు, వికారంతో ఆయన కుప్పకూలారు.
ఆ సమయంలో అయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు గుండెలో మూడు చోట్ల రక్త నాళాల పూడిక ఉన్నట్టుగా గుర్తించారు. వెంటనే యాంజియోప్లాస్టీ చికిత్స ద్వారా అవసరమైన చోట గుండెకు స్టంట్ వేశారు. తాజాగా గంగూలీ మరోసారి ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరినట్టుగా తెలుస్తుంది. నిన్న తరాత్రి నుంచి ఆయన ఛాతి నొప్పితో బాధపడటంతో అప్రమత్తమైన దాదా కుటుంబ సభ్యులు ముందు జాగ్రతగా ఆయనను కలకత్తా అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ విషయంపై మరింత సమాచారం రావలసి ఉంది.