logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

కరోనా కలకలం: క్వారెంటైన్ లోకి బీసీసీఐ అధ్యక్షుడు

బీసీసీఐ అధ్యక్షుడు,టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హోమ్ క్వారెంటైన్ లోకి వెళ్లారు. కొంతకాలంగా దాదా కుటుంబంలో కరోనా కలకం రేపుతోంది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి, సోదరుడైన స్నేహశీష్ గంగూలీకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. గత నెల 8వ తేదీన గంగూలీ తన 48వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.

ఈ వేడుకలకు సోదరుడు స్నేహశీష్ కూడా హాజరు కావడంతో దాదా తో పాటుగా ఈ వేడుకలో పాల్గొన్నవారంతా హోమ్ క్వారెంటైన్ కు వెళ్లారు. కాగా గతంలో స్నేహశీష్ భార్య, ఆమె తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. అప్పుడే స్నేహశీహ్ కు కూడా కరోనా అంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) ఖండించింది. తమ స్నేహశీష్ రోజు ఆఫీసుకు వచ్చి వెళ్తున్నాడని స్పష్టం చేసింది. తర్వాత స్నేహశీష్ బేలహాలోని దాదా గృహానికి వచ్చేసాడు.

ప్రస్తుతం ఆయనను బెల్లీ వ్యూ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా అతనికి పలు ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాటి వ్యవహారాలన్నీ అతనే దగ్గరుండి చూసుకుంటాడు. ఈ క్రమంలో రోజు ఫ్యాకరీకి వెళుతుండటం వలన తన సోదరుడికి కరోనా ముంపు పొంచి ఉందని దాదా ముందే ఊహించాడు. ఇప్పుడు నిజంగానే ఆయన కరోనా భారిన పడటం గమనార్హం. కోవిడ్ నిబంధనల ప్రకారం దాదా ఇప్పుడు పది రోజుల పాటు హోమ్ క్వారెంటైన్ లో ఉంటాడని బీసీసీఐ స్పష్టం చేసింది.

Related News