logo

  BREAKING NEWS

‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |  

మాజీ భర్తకు ధన్యవాదాలు తెలిపిన 7/G హీరోయిన్

సెల్వ రాఘవన్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘7/G బృందావన్ కాలనీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సోనియా అగర్వాల్. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అనిత పాత్రలో సోనియా ఎప్పటికీ గుర్తుండిపోయే నటన కనబరిచింది. అయితే ఆమెను వెండి తెరకు పరిచయం చేసింది కూడా సెల్వ రాఘవనే. ఈ దర్శకుడు తన సోదరుడు, తమిళ స్టార్ హీరో ధనుష్ తో ‘కాదల్ కొండేన్’ అనే సైకలాజికల్ రొమాంటిక్ సినిమాను తెరకెక్కించాడు.

అందులో ధనుష్ సరసన సోనియాను హీరోయిన్ గా పరిచయం చేసాడు. తమిళనాట ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాక ఉత్తమ నటిగా సోనియా ఎన్నో అవార్డులను అందుకుంది. ఇదే సినిమా తెలుగులో ‘నేను’ పేరుతో అల్లరి నరేష్ రీమేక్ చేసాడు. కాగా ఈ సినిమా సమయంలోనే సెల్వ రాఘవన్ తో సోనియా ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ రెండేళ్లకే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని దూరమయ్యారు.

తాజాగా సోనియా తన మాజీ భర్తను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన కాదల్ కొండెన్ సినిమా విడుదలై 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె తన మాజీ భర్తకు ధన్యవాదాలు తెలిపారు. ‘ఆ దేవుడికి, తమిళనాడు ప్రేక్షకులకు, సెల్వ రాఘవన్ కు, కస్తూరి రాజాకు చాలా థ్యాంక్స్. హీరోయిన్ గా నేను ప్రేక్షకులకు పరిచయమై 17 సంవత్సరాలు పూర్తి అయ్యింది. అలాగే ధనుష్ ‘కాదల్ కోండెన్’ కి పని చేసిన టెక్నీషియన్లు, ఆర్టిస్టులందరికీ ధన్యవాదాలు. తమిళ సినీ పరిశ్రమలో ఇది ఓ గుర్తుండిపోయే సినిమా’ అని సోనియా పేర్కొంది. కాగా చాలా కాలం సినీ పరిశ్రమకు దూరమైన సోనియా ఇప్పుడు తమిళనాట వరుస అవకాశాలు అందుకుంటుంది.

Related News