logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

చిరంజీవితో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా సినీ నటుడు చిరంజీవితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవి సోము వీర్రాజు కు అభినందనలు తెలిపారు. పుష్పమాల, శాలువాతో సత్కరించారు. సోదరుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రజా సమస్యలపై పోరాటం సాగించాలని చిరంజీవి కోరారు.

రానున్న 2024 ఎన్నికల కోసం జన సేన, బీజేపీ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. కాగా కన్నా లక్ష్మీ నారాయణ స్థానంలో సోము వీర్రాజును ఏపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బీజేపీ నియమించింది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సోము వీర్రాజు ప్రముఖులను కలుస్తున్నారు. ఇటీవల ఢిల్లీ పెద్దలను కూడా కలిసి వచ్చారు. ఈ నేపథ్యంలో చిరంజీవిని కూడా కలిశారు.

Related News