logo

  BREAKING NEWS

నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |   గ్రీన్ టీతో క‌రోనాకు చెక్‌  |   తెలంగాణ ప్ర‌జ‌లారా హాయిగా ఊపిరి పీల్చుకోండి.. క‌రోనా గండం గ‌ట్టెక్కిన‌ట్లే  |   క‌రోనా వ్యాక్సిన్‌కు ముందు, త‌ర్వాత మ‌ద్యం, సిగ‌రేట్ తాగొచ్చా ?  |   క‌రోనా విజేత‌లకు 10 నెల‌లు ర‌క్ష‌ణ‌  |   Good News: అతి త‌క్కువ ధ‌ర‌కు కొత్త‌ క‌రోనా వ్యాక్సిన్‌  |  

నంద్యాల కుటుంబం ఆత్మహత్య ఘటనపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి వేధిస్తున్నారని ఆరోపిస్తూ అబ్దుల్ సలాం కుటుంబం ఈ నెల 3వ తేదీన ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా సలాం కుటుంబం ఆత్మహత్య కేసుపై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఈ ఘటనలో పోలీసులను అరెస్టు చేయడం అన్యాయమన్నారు.

తమ డ్యూటీని సరిగ్గా నిర్వహించినందుకు వారిని అరెస్టు చేస్తారా? రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ ఘటనపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ముస్లిములు మాత్రమే మనుషులా, ఇతరులు మనుషులు కాదా హిందువులకు అన్యాయం జరిగిందని మేము మాట్లాడితే వైసీపీ, టీడీపీ మమ్మల్ని మతతత్వ రాజకీయాలు చేస్తున్నామనడం సరికాదన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై సోము వీర్రాజు తాజా వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎస్ఐ సోమశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ గంగాధర్ ను ఈ నెల 8వ తేదీన ఆరెస్టు చేసారు. కాగా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం జగన్ ఎవరికైనా న్యాయం ఒక్కటేనని, నిందితులకు బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేసారు.

Related News