logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

మూవీ రివ్యూ: ”సోలో బ్రతుకే సో బెటర్”

నటీనటులు: సాయిధరమ్ తేజ్- నాభా నటేష్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్రప్రసాద్, నరేష్
దర్శకత్వం: సుబ్బు
సంగీతం: థమన్
నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్

‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండగే’ సినిమాలతో హిట్టు అందుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మరో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమయ్యాడు. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమా క్రిస్టమస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 9 నెలలుగా కరోనా లాక్ డౌన్ కారణంగా మూతబడిన థియేటర్లు మళ్ళీ ఈ సినిమా ద్వారానే తెరుచుకుంటుండటంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా కు ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ మీదనే ఇతర సినిమాలు కూడా ఆధారపడి ఉన్నాయి. టైటిల్, టీజర్, ప్రోమోలతో యువతను ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి అనుబూతినిచ్చిందో తెలుసుకుందాం..

కథ:

ప్రేమ, పెళ్లి అనే కమిట్మెంట్స్ లేకుండా రాజ్యాంగం తనకిచ్చిన స్వేచ్ఛను ఎంజాయ్ చేయాలని అనుకునే వ్యక్తి విరాట్ (సాయి ధరమ్ తేజ్). అందుకు ఆర్ నారాయణ మూర్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాడు. హీరో అలా తయారవ్వడానికి కారణం అతని మావయ్య(రావు రమేష్) ప్రేమ పెళ్లి అంటేనే అసహ్యం కలిగేలా చేస్తాడు. ఇక కాలేజ్ పూర్తిచేసుకున్న విరాట్ కు ఈవెంట్ మానేజ్ మెంట్ ఉద్యోగం వస్తుంది. అందుకోసం హైదరాబాద్ వస్తాడు. కిషోర్(వెన్నెలకిషోర్)- అమృత(అమృత) పెళ్లి జరుగుతుండగా పెళ్లి కూతురు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తాను విరాట్ ను ప్రేమిస్తానని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేస్తుంది. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. అసలు పెళ్లంటే ఇష్టం లేని విరాట్ ను అమృత ఎందుకు ప్రేమిస్తుంది? అసలు అమృత ఎవరు? విరాట్ మరిత ప్రేమలో పడ్డాడా? అనేది మిగతా కథ.

విశ్లేషణ:
సోలో బ్రతుకే సో బెటరు సినిమాతో కొత్త దర్శకుడు సుబ్బు టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. మొదటి సినిమా కావడంతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే టాపిక్ ఎంచుకుని దానిని తెరపై ప్రెజెంట్ చేయడంలో కూడా బాగానే సక్సెస్ అయ్యాడు. ఇక హీరో విరాట్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. అతని పెరఫార్మన్స్ ప్రేక్షకులను ఎంటర్ టై చేస్తుంది. సినిమాలో హీరో డైలాగ్ మాడ్యులేషన్, ఎక్స్ ప్రెషన్స్, బ్యాచిలర్స్ కు బాగా కనెక్ట్ అయ్యే పాయింట్స్. ఫస్ట్ హాఫ్ లో హీరో పాత్ర నవ్వులు పూయిస్తుంది. హీరోయిన్ గా నటించిన నాభా నటేష్ పక్కింటి అమ్మాయిలా కనిపించి బాగానే ఆకట్టుకుంది. ఎప్పటిలాగే క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పించింది. ఎమోషనల్ సీన్స్ లో కూడా నాభా సూపర్ అనిపించింది. సినిమాలో రావు రమేష్ మరో కీలక పాత్రలో కనిపిస్తాడు. రావు రమేష్ పాత్ర, అతని నటన సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. ఇక మిగిలిన పాత్రల్లో రాజేంద్రప్రసాద్, నరేష్ లు తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. ఇక కథ విషయానికొస్తే.. అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ లైన్ ను తీసుకున్నప్పటికీ కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకు మైనస్ పాయింట్ గా నిలిచింది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ అలరిస్తుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ వర్కౌట్ కాలేదనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో అన్ని సినిమాల్లాగే కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సన్నివేశాలు కనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉండటం బోర్ కొట్టిస్తుంది. సినిమా మొత్తంలో సాయి ధరమ్ తేజ్ నటన, హావభావాలు వినోదాన్ని పంచుతాయి. థమన్ సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ ఉన్నాయి. ఈ సినిమాలో విజువల్స్ ఆకట్టుకుంటాయి. అయితే ప్రస్తుతం కోవిడ్ కారణంగా ప్రజలు రిస్కు చేసి మరీ ఈ సినిమాను ఆదరిస్తారా లేదా? అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:
సాయి ధరమ్ తేజ్ నటన, యూత్ కి కనెక్ట్ అయ్యే డైలాగ్స్, రావు రమేష్, స్టోర్ లైన్

మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనం లేకపోవడం, సెకండ్ హాఫ్ లో సాగదీత

రేటింగ్: 2.5/5

Related News