logo

  BREAKING NEWS

పెరిగిన బంగారం ధరలు 15.04.2021 బంగారం, వెండి ధరలు  |   బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |  

కొడుకు కోసం ఎనిమిది నెలలుగా.. కంటతడి పెట్టిస్తున్న భారత జవాను తండ్రి గాథ

56 ఏళ్ల మంజార్ అహ్మద్ వాగే ఉగ్రవాదుల చేత కిడ్నాప్ చేయబడిన ఓ భారత సైనికుడి తండ్రి. కొడుకు మృతదేహం కోసం గత ఎనిమిది నెలలుగా ఈ తండ్రి చేస్తున్న పని ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టిస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే పలుగు, పారా పట్టుకుని ఇంటి నుంచి బయలుదేరుతాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఒక చోటకు వెళ్లి అక్కడి నేలనంతా తవ్వి కొడుకు మృతదేహం కోసం వెతుకుతుంటారు. అక్కడ కనిపించకపోతే మరుసటి రోజు మరో ప్రదేశంలో ఇలాగే వెతుకుంతుంటాడు.

అహ్మద్ వాగే 24 ఏండ్ల కుమారుడు షకీర్ 2016 లో భారత సైన్యంలోని టెరిటోరియల్ ఆర్మీలో రైఫిల్ మ్యాన్ గా విధుల్లో చేరాడు. గతేడాది ఆగస్టు 2 వ తేదీన ఈద్ సందర్భంగా ఇంటికి వచ్చిన షకీర్ పండగ రోజు కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపాడు. ఆ రోజు సాయంత్రం స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నా అని, ఆర్మీ అధికారులు ఫోన్ చేసి అడిగితే కంగారు పడవద్దని ఇంట్లో చెప్పి వెళ్ళాడు. అవే అతని ఆఖరి మాటలు. అలా వెళ్లిన షకీర్ మళ్ళీ ఇంటికి తిరిగిరాలేదు.

అదే రోజు షకీర్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతనిని చిత్రహింసలకు గురి చేసి చంపేశారని ప్రత్యక్ష సాక్షిగా భావిస్తున్న ఓ మహిళ చెప్తుంది. కిడ్నాప్ జరిగిన మరుసటి రోజే షకీర్ వాహనం పూర్తిగా మంటల్లో కాలిపోయి కనిపించింది. అయితే భారత ఆర్మీ దగ్గర మాత్రం షకీర్ మరణించాడని చెప్పడానికి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవు. ఈ ఘటన జరిగిన సరిగ్గా వారం రోజుల తర్వాత తన ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో రక్తంతో తడిసిన తన కొడుకు బట్టలు కనిపించాయి ఆ తండ్రికి.

అవి చూసి ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. గుండెలవిసేలా రోదించాడు. ఇవన్నీ చూసాక ఇక తన కొడుకు బతికి ఉంటాడనే నమ్మకం అహ్మద్ వాగేకు లేదు. కనీసం తన కొడుకు మృతదేహాన్నైనా అప్పగించాలని అధికారులను వేడుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు షకీర్ ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు.

దీంతో మరణించిన తన కొడుకుని ఎలాగో తీసుకు రాలేనని కనీసం తన మృతదేహానికి అంత్యక్రియలైన నిర్వహిస్తే అతని ఆత్మకు శాంతి కలుగుతుందని భావించాడు. ఎనిమిది నెలలుగా కొడుకు మృతదేహం కోసం వెతకడం ప్రారంభించాడు. ఇప్పటికీ కొడుకు ఆచూకీ కనిపెట్టలేకపోయినా ఏదో ఒక రోజు తన కొడుకు మృతదేహాన్ని కనుగొంటాననే ఆశతో ప్రయత్నిస్తున్నాడు. జమ్మూ కశ్మీర్ లో చాలా మంది జవాన్ల లాగానే షకీర్ పేరు కూడా మిస్సైన జాబితాలో ఉండిపోయింది.

Related News