logo

  BREAKING NEWS

ఢిల్లీ రైతుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!  |   రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |  

సాఫ్ట్ వేర్ ఉద్యోగిని లావణ్య ఆత్మహత్య కేసులో కొత్త కోణం..!

సాఫ్ట్ వేర్ ఉద్యోగిని లావణ్య లహరి భర్త పైలట్ వెంకటేష్ అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. వెంకటేష్ గత కొంత కాలంగా సరీనా అనే పైలట్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఉద్యోగం పేరు చెప్పి సరీనా తో విదేశాలలో గడిపి వచ్చేవాడు. కొన్ని రోజుల క్రితం వెంకటేష్ వాట్సాప్ వీడియో కాల్స్ మాట్లాడుతుండగా లహరి ఈ విషయం తెలుసుకుంది. వీరిద్దరి టిక్ టాక్ వీడియోలు కూడా బయట పడటంతో విస్తుపోయింది. ఓసారి భర్త లావణ్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.

దీంతో సరీనాకు ఫోన్ చేసి తన భర్తను వదిలేయాలని ప్రాధేయపడింది. తన జీవితం నాశనం చేయొద్దని వేడుకుంది. ఈ విషయం సరీనా వెంకటేష్ కు చెప్పడంతో భార్యపై పట్టరాని కోపంతో ఊగిపోయాడు. ఆమెకు ఎందుకు ఫోన్ చేసావని లహరిపై దాడి చేసాడు. ఇలా కొంత కాలంగా జరుగుతుంది. గర్భవతి అని కూడా చూడకుండా తనపై భర్త భౌతికంగా దాడి చేస్తుండటంతో మనస్తాపం చెందిన లహరి శుక్రవారం రోజున ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడింది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని రాళ్ల గుడాకు చెందిన లావణ్య భర్త జెట్ ఎయిర్ వేస్ లో పైలట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సెరీనా అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని లావణ్యను వేధించడం మొదలు పెట్టాడు.ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియో లో తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్యను ఆ తర్వాత వదిలించుకునే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలో పిల్లలు లేరనే సాకుతో వేధింపులకు గురి చేసాడు.

లావణ్య ముందే పరాయి స్త్రీలతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడటం , వారితో సరసాలు ఆడటం చేసి లావణ్యను మానసికంగా వేధించాడు. లావణ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెంకటేష్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు పోలీసులు. వెంకటేష్ ఆగడాలపై దర్యాప్తు జరపాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లహరికి ఇప్పటికే ఆరు సార్లు అబార్షన్ చేయించాడని, తమ బిడ్డను చిత్రహింసలకు గురి చేసి హత్య చేసాడని లావణ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతని పైలట్ లైసెన్స్ రద్దు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Related News