logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

శుభవార్త.. రూ.14,490 లకే శాంసంగ్ స్మార్ట్ టీవీలు!

స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి శుభవార్త. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తన కొత్త స్మార్ట్ టీవీలను ఇండియాలో విడుదల చేసింది. తన అధికారిక సైట్ తో పాటుగా ప్రముఖ ఇ – కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ద్వారా స్మార్ట్ టీవీల సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ జూన్ 19 అర్థరాత్రి నుంచి ప్రారంభించనుంది.

అయితే మొదటి 48 గంటల్లో డెబిట్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసే వినియోగదారులకు ఆన్ లైన్ లో అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. శాంసంగ్ ది ఫ్రెమ్ 2020 పేరుతో లైఫ్ స్టైల్ టీవీని శాంసంగ్ తీసుకువచ్చింది. దీంతో పాటుగా మరో 10 కొత్త వేరియంట్లను కూడా లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధరను రూ. 14,490 గా ప్రకటిచింది. అమెజాన్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో ప్రీపెయిడ్ ద్వారా కొంటే వీటిపై రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

శాంసంగ్ టీవీల ధరలు..
హెచ్ డీ రెడీ స్మార్ట్ టీవీ (32 అంగుళాలు)- రూ.14,490
ఫుల్ హెచ్ డీ స్మార్ట్ టీవీ (43 అంగుళాలు)- రూ.31,990
4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ టీవీ (43 అంగుళాలు)- రూ.36,990
4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ టీవీ (65 అంగుళాలు)- రూ.89,990
ది ఫ్రెమ్ 2020 టీవీ (50 అంగుళాలు)- రూ.74,990
ది ఫ్రెమ్ 2020 టీవీ (55 అంగుళాలు)- రూ.84,990ది ఫ్రేమ్ 2020 టీవీ (65 అంగుళాలు)- రూ.1,39,990

ప్రత్యేక ఫీచర్లు..
ఆన్ లైన్ కంటెంట్ ను ఎక్కువగా ఇష్టపడేవారిని దృష్టిలో పెట్టుకుని ఈ టీవీలను రూపొందించినట్టు తెలిపింది. కాగా హాట్ స్పాట్ టెక్నాలజీ, యూఎస్బీ 3. 0, గూగుల్ అసిస్టెంట్, శాంసంగ్ బైక్స్ బై వాయిస్ అసిస్టెంట్ వీటి ప్రత్యేకత. వీటితో పాటుగా గేమ్ ఎన్ హానర్స్, కంటెంట్ గైడ్, పర్సనల్ కంప్యూటర్ మోడ్, హోమ్ క్లౌడ్, మ్యూజిక్ ప్లేయర్, లాంటి ఫీచర్స్ అదనంగా ఉన్నాయి. ఈ టీవీలను కంప్యూటర్లుగా మార్చుకుని ఉపయోగించుకునే సౌలభ్యం కూడా ఉందని సంస్థ తెలిపింది.

Related News