logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

శాసంగ్ నుంచి మరో స్మార్ట్ ఫోన్.. అతి తక్కువ ధర కోరుకునే వారికోసం!

అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్న యూజర్లకు శాసంగ్ శుభవార్త వినిపించింది. తన కొత్త స్మార్ట్ ఫోన్ ను సోమవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం01 కోర్‌ పేరుతో దీనిని మార్కెట్లో విడుదల చేసారు. కాగా అతి తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లను అందించడం ఈ స్మార్ ఫోన్ ప్రత్యేకతగా సంస్థ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ రూ. 5,499, రూ. 6,499 గా రెండు వేరియంట్లలో లభిస్తుంది.

ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టం పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది. M1 Core 1జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్ కలిగిన వేరియెంట్ ధర రూ.5,499 కాగా, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ ధర రూ.6,499 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ నలుపు, తెలుపు, ఎరుపు మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉంది.

గెలాక్సీ ఎం01 కోర్ ఫీచర్లు..
5.3 ఇంచులు స్క్రీన్, 8 ఎంపీ కెమెరా + 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16 జీబీ, 32 జీబీ స్టోరేజ్ ని కలిగి ఉంది. క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది. HD+ రెజల్యూషన్ ను కలిగి ఉండటం ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు. ప్రస్తుతం అన్ని సామ్ సుంగ్ స్టోర్లలో ఈ ఫోన్ ను అందుబాటులో ఉంచారు. జులై 29 నుంచి అని ఈ కామర్స్ వెబ్ సైట్లలో కూడా అందుబాటులో ఉంచుతామని సంస్థ పేర్కొంది.

Related News