logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

రెడ్ మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. ధర కేవలం రూ. 10 వేల లోపే..

స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమీ భారత్ లో రెడ్ మీ 9 ప్రైమ్ ను విడుదల చేసింది. రియల్ మీ నార్జో 10, శాంసంగ్ గెలాక్సీ ఎం11 స్మార్ట్ ఫోన్లకు పోటీగా షియోమీ ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇక ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్ల విషయానికొస్తే..

నాలుగు కలర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. వెనుక వైపు నాలుగు కెమెరాల సెటప్, వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లే, మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ తో దీనిని రూపొందించారు. ఈ ఫోన్లో రెండు వేరియంట్లు ఉండగా.. 64 జీబీ వేరియంట్ ధరను రూ.9,999గానూ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.11,999గానూ నిర్ణయించారు.

ఈ ఫోన్ కు సంబందించిన సాధారణ సేల్ ను ఆగస్టు 17 నుంచి అమెజాన్ , ఎం ఐ. కామ్, ఎం ఐ హోమ్ స్టోర్స్ లలో జరగనుంది. అయితే ముందుగా ఆర్డర్ చేసుకోవాలని అనుకునే వారి కోసం ఆగస్టు 6వ తేదీన ఉదయం 6 గంటలకు ప్రైమ్ డే సేల్ జరగనుంది.

రెడ్ మీ 9 ప్రైమ్ స్పెసిఫికేషన్లు..
4 జీబీ ర్యామ్
64GB ఇంటర్నల్ స్టోరేజి
6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఐపీఎస్ డిస్ ప్లే
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్

Related News