logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

ఈ చిన్న తప్పు చేయకండి.. ఇలా పడుకుంటే గ్యాస్ట్రిక్, అసిడిటీ సమస్యలు మాయమవుతాయి!

ఈరోజుల్లో చాలా మంది ఎదుర్కునే ఆరోగ్య సమస్యల్లో జీర్ణాశయ సమస్యలు కూడా ఒకటి. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకుంటే కడుపులో గ్యాస్ పేరుకుపోవడం, అసిడిటీ, అసౌకర్యంగా అనిపించడం వంటివి చికాకు పెడుతుంటాయి. ఫలితంగా మన రోజు వారి పనులపై ఆ ప్రభావం పడుతుంది. దీంతో పని పై శ్రద్ధ పెట్టలేరు. జీర్ణ సమస్యలకు చాలానే కారణాలు ఉంటాయి. మన ఆహారంలో మసాలాలు, అధిక కొవ్వు, త్వరగా జీర్ణం కానీ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే జీర్ణ శక్తి మందగిస్తుంది. అయితే మన తిన్న ఆహరం పూర్తిగా జీర్ణ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకోసం ఆయుర్వేదంలో ఓ చిన్న చిట్కా ఉంది.

సాధారణంగా మనం ప్రతి రోజు ఏదో ఒక భంగిమలో నిద్రిస్తుంటాం. ముఖ్యంగా రాత్రి వేళల్లో కొంత మంది ఎడమ వైపు పడుకుంటే.. మరి కొందరికి కుడి వైపు తిరిగి పడుకుంటేనే నిద్ర పడుతుంది. కానీ నిద్రించే సమయంలో మనం చేసే చిన్న తప్పే జీర్ణాశయ సమస్యలకు కారణమవుతుందట. నిద్రపోవడం ముఖ్యం కానీ ఎటు వైపు తిరిగితే ఏమిటి అనుకుంటారేమో ఒకడే ఉంది అసలు సమస్య. రాత్రి వేళల్లో కుడి వైపు తిరిగి పడుకునే వారి కంటే ఎడమవైపు తిరిగి పడుకునే వారే రోజంతా ఎంతో చురుకుగా ఉంటారట. అంతేకాదు వీరిలో జీర్ణ సమస్యలు ఉండవని శాస్త్రీయంగా రుజువైంది.

తిన్న ఆహరం జీర్ణం కావడానికి జీర్ణ వ్యవస్థ కొన్ని యాసిడ్లను విడుదల చేస్తుంది. ఇవి మన పడుకున్న సమయంలో ఎడమవైపు తిరి ఉన్నప్పుడే సక్రమంగా పని చేయగలవు. కుడి వైపు పడుకున్న వారిలో ఈ యాసిడ్లన్నీ పైకి ఎగదన్ని గ్యాస్ట్రిక్, అసిడిటీ సమస్యలు కలుగుతాయి. అందుకె కొన్ని సార్లు పడుకున్నప్పుడు ముక్కులోకి ఏవో ఘాటైన ద్రవాలు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇవి ముక్కు వరకు రావడానికి కారణం మనం సరైన భంగిమలో పడుకోకపోవడమే. అయితే ఇలా జరగడం చాలా ప్రమాదకరం కూడా.

ఎడమ వైపు తిరిగి పడుకున్న వారిలో రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం బాగుంటుంది. వెన్నుముక సమస్యలతో బాధపడేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలకూ కూడా వైద్యులు ఇదే సూచిస్తారు. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు లింప్ గ్రంథులు ఉపయోగపడతాయి. ఎడమవైపు పడుకున్నప్పుడే ఈ గ్రంథులు సక్రమంగా పనిచేస్తాయి. నిద్రలో గురక పెట్టేవారు కూడా ఎడమవైపు తిరిగి పడుకుంటే ఈ సమస్య తీరిపోతుంది.

Related News