logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

నిద్రలో ఉన్నపుడు గుండెలపై ఎవరో కూర్చున్నట్టుగా అనిపిస్తుందా?

మనలో కొందరికి ఘాడ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా గుండెమీద ఎవరో కూర్చొని ఉన్నట్టు, గొంతు పిసుకుతున్నట్టు అనిపించడం ఏదో ఒక సందర్భంలో అనుభవం లోకి వస్తుంది. ఆ సమయంలో ఎంత ప్రయత్నించినా శరీరం, చేతులు, కాళ్లు ఇవేవీ కదలవు. కేవలం కళ్లు మాత్రమే తెరిచి చూడగలుగుతాము. మన చుట్టూ ఏదో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ మన అవయవాలేవీ మన స్వాధీనంలో ఉండవు. ఈ స్థితి కొద్ది సెకన్లపాటు మాత్రమే ఉంటుంది. కానీ ఇదొక భయంకర అనుభవం. ఇలా ఎందుకు జరుగుతుందో తెలీక చాలా మంది ఆందోళనకు గురవుతారు. దీనిని దెయ్యంగా భావించడం, భయపడడం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఉదయం లేచి సన్నిహితులకు దానిని రకరకాలుగా వర్ణించి మన అనుభవం పంచుకుంటాం.

అయితే అది దెయ్యం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ సమస్యను ‘స్లీపింగ్ పెరాలసిస్’ అంటారు. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం మంది ప్రజలకు ఇలాంటి అనుభం ఎదురవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఒక న్యూరల్ మ్యాప్ రూపొందించారు. మెదడులో నిర్దేశిత ప్రాంతంలో చోటుచేసుకునే ‘కల్లోలం’ దెయ్యాలు, రాక్షసుల రూపంలో నిద్రలో కనిపిస్తుందని వారు తెలిపారు. దీనినే మనం దెయ్యంగా భావించి భయపడతామని వారు స్పష్టం చేశారు. స్లీపింగ్ పెరలాసిసి రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. నిద్రనుంచి పూర్తిగా మెలకువ స్థితికి వచ్చే మధ్య సమయంలో కండరాల బలహీనత వల్ల ఇలా జరుగుతుంది.

ఒక్కోసారి ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం భ్రాంతులకు (హెల్యూసీనేషన్) కూడా లోనుకావచ్చు. అంటే మన గదిలోకి ఎవరో అపరిచితులు ప్రవేశించినట్లుగా అనిపించడం, దానికి తగినట్లు మనం స్పందించాలనుకున్నా ప్రతిస్పందించలేకపోతున్నట్లుగా అనిపించవచ్చు. ఈ స్లీప్‌ పెరాలసిస్‌ అన్నది రెండు సమయాల్లో కలుగుతుంది. మొదటిది… నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు, రెండోది నిద్రనుంచి మెలకువ స్థితిలోకి వస్తున్నప్పుడు.

స్లీప్‌ పెరాలసిస్‌ అన్నది చాలా అరుదైన సమస్యేమీ కాదు. ప్రతి పదిమందిలో నలుగురికి ఈ విధమైన సమస్య ఉంటుంది. సాధారణంగా టీనేజ్ దశలో పిల్లలు దీన్ని మొదటిసారిగా గుర్తించడం జరుగుతుంటుంది. అయితే ఏ వయసువారిలోనైనా, పురుషుల్లోనూ, స్త్రీలలోనూ ఇది సంభవించవచ్చు. స్లీప్‌ పెరాలసిస్‌ అన్నది సాధారణంగా కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తుంటుంది.

కారణాలు:
నిద్రలేమి, మాటిమాటికీ నిద్రవేళలు మారుతుండటం, బైపోలార్‌ డిజార్డర్‌ వంటి మానసిక వ్యాధులు ఉన్నవారిలో ఇది అధికంగా కనిపిస్తుంది.
ఎప్పుడూ పక్కకు ఒరిగిపడుకోకుండా కేవలం వీపు మీదే భారం మోపి పడుకోవడం, కొన్ని రకాల మందులు వాడటం, తీవ్ర అవమానానికి గురికావడం వంటివి జరిగినప్పుడు కూడా నిద్రలో ఈ అనుభవం ఎదురవుతుంది.

చికిత్స:
స్లీప్‌ పెరాలసిస్‌ వచ్చిన చాలామందికి ఎలాంటి చికిత్సా అవసరం లేకుండా దానంతట అదే తగ్గిపోతుంది. స్లీప్‌ పెరాలసిస్‌కు దోహదం చేస్తున్న అసలు కారణానికి చికిత్స చేస్తే ఇది తగ్గిపోతుంది. అంటే బాగా నిద్రపోవాలని ఉన్నా నిద్రపట్టకపోవడం వంటివి. కనీసం 6 – 8 గంటలపాటు గాఢనిద్రపోవడం వంటి మంచి నిద్ర అలవాట్లతో ఈ సమస్యను అధిగమించవచ్చు. ఏవైనా మానసిక సమస్యలు ఉంటే వాటికి చికిత్స చేయడం ద్వారా కూడా దీనికి చికిత్స చేయవచ్చు.

Related News