logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

మిస్టరీగా మారిన టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య..!

టిక్ టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 16 ఏళ్ల వయసులోనే ఆమె లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. టిక్ టాక్ లో ఆమెకు 11 లక్షల మంది అభిమానులు ఉన్నారు. యూట్యూబ్, స్నాప్ చాట్, ఇంస్టాగ్రామ్ లలో ఆమె పోస్ట్ చేసే డాన్స్ వీడియోలు, డబ్ స్మాష్ లను లక్షల మంది ఫాలో అవుతారు. అయితే హఠాత్తుగా ఆమె ఆత్మహత చేసుకుని ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదంగా మారింది.

ఢిల్లీలో ఆమె తన కుటుంబంతో కలిసి ఉంటుంది. కాగా తన గదిలో ఆమె ఆత్మహత్య చేసుకుని కనిపించడం ప్రతి ఒక్కరిని షాక్ కు గురి చేసింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా బుధవారం రాత్రి సియా తన మేనేజర్ తో ఓ కొత్త డాన్స్ వీడియో గురించి చాలా ఉత్సాహంగా చర్చించారు. అనంతరం ఆమె ఆత్మహత్య వార్త విని తాను నిర్ఘాంతపోయానని ఆమె మేనేజర్ తెలిపాడు.

మరోవైపు సియా ఆత్మహత్యకు బెదిరింపులే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వ్యక్తులు తన టిక్ టాక్ వీడియోలు చేయడంపై ఆమెను బెదిరించారని ఆ సంఘటనతో సియా తీవ్రంగా కలత చెందిందని సన్నిహితులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

సియా ఆత్మహత్యపై ఆమె కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు. కాగా సియా ఆత్మహత్య చేసుకున్న రోజు కూడా మామూలుగానే కనిపించిందని అంటున్నారు. చివరిసారిగా ఆమె ఒక పంజాబీ పాటకు డాన్స్ చేసి పోస్ట్ చేసారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

Related News
%d bloggers like this: