టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గారాల పట్టి సితార అంటే ఆయన అభిమానులు ఎనలేని ప్రేమను చూపిస్తారు. సితాకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. మహేష్ తో సితార ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తూనే ఉంటాయి. తాజాగా నమ్రత సితార తన తండ్రితో ఉన్న మరో ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు మహేష్ తో సితార కలిసి తీసుకున్న ఫొటోల్లో ఆమె చిన్న పిల్లలా ఉంటుంది. క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తుంది. ఇప్పుడు మనం చూసే ఫోటోలు చాలా కాలం కిందటివి. అయితే ఇటీవల లాక్ డౌన్ తర్వాత సితార అంతగా బయటకు కనిపించలేదు.
కానీ తాజాగా మహేష్ తో ఉన్న ఫొటోలో సితార తన తండ్రి భుజాల వరకు పెరిగిపోయింది. దీంతో ఈ ఫోటో చూసినవారంతా షాకవుతున్నారు. ఇంతలో ఎంత మార్పు అంకుంటున్నారు. ఎంతైనా ఆడపిల్లలు ఇట్టే ఎదిగిపోతారు కదా అని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ కుమారుడు గౌతమ్ కూడా తండ్రితో సమానంగా పెరిగి అతనికి తమ్ముడిలా కనిపిస్తాడు. ఇప్పుడు సితార కూడా ఆ జాబితాలోనే చేరిపోయింది.