logo

  BREAKING NEWS

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |  

సింగ‌ర్ సునీత కాబోయే భ‌ర్త అంద‌రికీ తెలిసిన వారే

ఎట్ట‌కేల‌కు ఊహాగానాల‌కు తెర‌దించారు సింగ‌ర్ సునీత‌. త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న‌కు త‌గిన తోడు వెతుకున్నారు. వైవాహిక బంధంలోకి అడుగుపెట్ట‌బోతున్నారు. చాలా రోజులుగా సింగ‌ర్ సునీత రెండో వివాహం చేసుకోబోతున్నార‌నే ప్ర‌చారం మీడియాలో, సోష‌ల్ మీడియాలో, ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో బాగా జ‌రుగుతోంది. వీటిని కొన్నిసార్లు సునీత స్వ‌యంగా ఖండించారు.

ఇటీవ‌ల త‌న రెండో వివాహానికి సంబంధించి వ‌స్తున్న వార్త‌ల‌పై సునీత సైలెంట్‌గా ఉంటున్నారు. దీంతో ఆమె వివాహం చేసుకోబోతున్నార‌నే ప్ర‌చారం మ‌రింత పెరిగింది. ఈ ప్ర‌చారాన్ని నిజం చేస్తూ సునీత నిశ్చితార్థం జ‌రిగింది. వ‌ధూవ‌రుల కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్య నిరాడంబ‌రంగా వీరి నిశ్చితార్థం అయ్యింది. ఈ విష‌యాన్ని సునీత ధ్రువీక‌రించారు. ఆమెనె నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, త‌న కాబోయే వ‌రుడి ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌‌ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆమె భావోద్వేగానికి గుర‌య్యారు. ప్ర‌తి త‌ల్లి లాగానే పిల్ల‌లు బాగా స్థిర‌ప‌డాల‌ని క‌ల‌లు కంటున్నాను. ఇదే స‌మ‌యంలో నేను కూడా జీవితంలో స్థిర‌ప‌డాల‌ని చూడాల‌నుకుంటున్న పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు నాకు ఉన్నందుకు సంతోషిస్తున్నాను. ఆ క్ష‌ణం వ‌చ్చింది. రామ్ నా జీవితంలో ఒక ముఖ్య‌మైన స్నేహితుడిగా, ఓ అద్భుత‌మైన భాగ‌స్వామిగా రాబోతున్నాడు. మేము ఇద్ద‌ర‌మూ అతి త్వ‌ర‌లో వివాహం చేసుకోబోతున్నాం. నేను నా జీవితాన్ని చిలా ప్రైవేట్‌గా ఉంచాల‌ని చూస్తాను. అది అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులంద‌రికీ ధ‌న్య‌వాదాలు. అని ఆమె పోస్ట్ చేశారు.

కాగా, రామ‌కృష్ణ వీర‌ప‌నేని అనే బిజినెస్‌మెన్‌ను సునీత వివాహం చేసుకోబోతున్నారు. తెలుగు డిజిట‌ల్ మీడియా రంగంలో రామ‌కృష్ణ స‌క్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్ మ్యాంగో మాస్ మీడియా, వాకెడ్ అవుట్ వంటి సంస్థ‌ల‌ను ఏర్పాటుచేసిన ఆయ‌న‌కు అనేక యూట్యూబ్ ఛాన‌ళ్లు ఉన్నాయి. డిజిట‌ల్ మీడియా రంగంలో స్థిర‌ప‌డిన ఆయ‌న‌కు చాలా రోజులుగా సింగ‌ర్ సునీత‌తో ప‌రిచ‌యం ఉంది. ఈ ప‌రిచ‌యంతోనే ఇద్ద‌రూ వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

సంగీత కుటుంబంలో జ‌న్మించిన సునీత మొద‌ట యాంక‌ర్‌గా త‌న జీవితాన్ని ప్రారంభించారు. ఆ త‌ర్వాత సింగ‌ర్‌గా మారి బాగా పేరు సంపాదించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆమె దాదాపు 3 వేల‌కు పైగా పాట‌లు పాడారు. 19 ఏళ్లకే కిర‌ణ్ అనే వ్యక్తితో సునీత వివాహం జ‌రిగింది. వీరికి ఆకాష్‌, శ్రేయ అని ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. భ‌ర్త‌తో విభేదాల కార‌ణంగా చాలా రోజుల క్రిత‌మే సునీత విడాకులు తీసుకున్నారు. ప్ర‌స్తుతం సునీత వ‌య‌స్సు 42 ఏళ్లు.

Related News