logo

  BREAKING NEWS

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |  

గాయని సునీత రెండో పెళ్లి వాయిదా.. కారణమిదే!

టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత రెండో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. మీడియా హౌస్ అధినేత రామ్ వీరపనేని తో ఇటీవలే ఆమె నిశ్చితార్థం జరిగింది. దీంతో సునీత అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు. కాగా డిసెంబర్ 27న పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయించారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి వాయిదా పడినట్టుగా తెలుస్తుంది.

పెళ్లి వాయిదా పడటానికి గల స్పష్టమైన కారణాలు తెలియలేదు. కానీ ఈ సంవత్సరం గడిచాక వచ్చే ఏడాదిలో పెళ్లి ఉండనుందని తెలుస్తుంది. ఈ ఏడాది ముహుర్తాలు లేకపోవడం కారణంగానే ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి వాయిదా వేసుకున్నట్టుగా సమాచారం. ఈ వార్తకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన సునీత ఆ తర్వాత భర్తతో విబేధాల కారణంగా అతనితో విడిపోయి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్నేహితుడైన రామ్ ను పెళ్లి చేసుకోవాలని ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. సునీత రెండో వివాహం పై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News