టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత రెండో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా ఆమె పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ మీడియా హౌస్ అధినేత రామ్ వీరపనేనిని ఆమె త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఆయనకు కూడా ఇది రెండో వివాహమనే తెలుస్తుంది.
అయితే చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత ఇద్దరు పిల్లలకు తల్లిగా మారారు. ఆ తర్వాత భర్తతో విభేదాల కారణంగా ఆమె భర్తతో విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లల బాధ్యతను తీసుకుని వారిని పెద్ద చేసారు. ఇప్పుడు ఆమె తీసుకున్న ఈ నిర్ణయంపై ఆమె శ్రేయోభిలాషులు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా సునీత తన రెండో వివాహంపై స్పందించారు.
”అందరు తల్లులు లాగానే పిల్లల భవిష్యతు బాగుండాలనుకున్నా. జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని కళలు కన్నాను. చివరకు ఆ క్షణం వచ్చింది. నా జీవితంలోకి స్నేహితుడిగా వచ్చిన రామ్ నా జీవిత భాగస్వామి కాబోతున్నారు. మేమిద్దరం వివాహ బంధం ద్వారా కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాము. నా వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచుతున్న విషయాన్ని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఎప్పటిలాగే నాకు మద్దతు ఇచ్చి అండగా ఉంటారని ఆశిస్తున్నా” అంటూ సునీత తన మనసులో మాట చెప్పుకొచ్చారు.