logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత

సింగర్ సునీత వివాహం రామ్ వీర‌ప‌నేనితో ఘ‌నంగా జ‌రిగింది. త‌న రెండో పెళ్లి గురించి ప్ర‌శంస‌లు, విమ‌ర్శ‌లు వ‌స్తున్నా సునీత మాత్రం త‌న‌కు ఓ తోడు కావాల‌నుకుంది. ఈ నెల 9న శంషాబాద్ అమ్మ‌ప‌ల్లి ఆల‌యంలో త‌ను కోరుకున్న వ్య‌క్తిని వివాహం చేసుకుంది. అయితే, వీరిద్ద‌రి ప‌రిచ‌యం, వివాహానికి ముందు ప‌రిస్థితుల‌పై ఇప్ప‌టివ‌ర‌కు సునీత బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. తాజాగా ఆమె ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విష‌యాల‌పై పెద‌వి విప్పారు. అనేక ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను సునీత వెల్ల‌డించారు.

రామ్ వీర‌ప‌నేనితో త‌న‌కు చాలా కాలంగా ప‌రిచ‌యం ఉంద‌ని, త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ను రామ్ వీర‌ప‌నేని చూసుకునే వార‌ని సునీత తెలిపారు. అలా త‌మ మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని, ఇద్ద‌రి మ‌ధ్య చాలా ఏళ్లుగా స్నేహం ఉంద‌ని, ఈ స్నేహాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడు పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పారు.

నిజానికి, త‌న‌ను చాలా ఏళ్లుగా పెళ్లి చేసుకోవాల‌ని త‌న త‌ల్లిదండ్రులు కోరుతున్నార‌ని సునీత తెలిపారు. కానీ, పిల్ల‌లు చిన్నవార‌ని, వారి బాగోగులు చూసుకోవాల‌నే ఆలోచ‌న‌తో తాను ఇంత‌కాలం రెండో పెళ్లి ఆలోచ‌న కూడా చేయ‌లేద‌ని చెప్పారు. ఇప్పుడు కూడా రామ్‌తో త‌న‌కు పెళ్లి ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడు ముందుగా త‌న‌కు త‌న పిల్ల‌లే గుర్తు వ‌చ్చార‌ని సునీత తెలిపారు.

త‌న రెండో పెళ్లి నిర్ణ‌యం వ‌ల్ల త‌న పిల్ల‌లు ఇబ్బంది ప‌డొద్ద‌ని అనుకున్నాన‌ని, ఇదే స‌మ‌యంలో తన‌కు ఒక తోడు కావాల‌ని అనుకున్నాన‌ని తెలిపారు. జీవితంలో ఎదుర‌య్యే క్లిష్ట సంద‌ర్భాల్లో మ‌న‌కు తోడుగా నిలిచే వ్య‌క్తి, మ‌న క‌ష్ట‌సుఖాల్లో అండ‌గా నిలిచే వ్య‌క్తి జీవిత భాగ‌స్వామిగా దొర‌క‌డం అదృష్ట‌మ‌ని, ఆ అదృష్టం రామ్ రూపంలో త‌న‌కు ల‌భించింద‌ని సునీత చెప్పారు.

పెళ్లి చేసుకోవాల‌నే త‌న నిర్ణ‌యాన్ని ముందుగా త‌న పిల్ల‌ల‌కు చెప్పాన‌ని, అప్పుడు వారు త‌న‌ను కౌగిలించుకొని చాలా సంతోషం వ్య‌క్తం చేశార‌ని సునీత తెలిపారు. పిల్ల‌లు పెద్ద‌వార‌య్యార‌ని, ప‌రిస్థితుల‌ను చ‌క్క‌గా అర్థం చేసుకునే ప‌రిణ‌తి వారిలో ఉంద‌ని తెలిపారు. పిల్ల‌ల‌తో పాటు త‌న కుటుంబం కూడా త‌న పెళ్లి నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించి త‌న‌కు అండ‌గా నిలిచింద‌ని సునీత చెప్పారు.

క‌రోనా నేప‌థ్యంలో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నామ‌ని, కేవ‌లం ద‌గ్గ‌రి బంధువులు, అత్యంత స‌న్నిహితుల‌ను మాత్ర‌మే త‌మ వివాహానికి ఆహ్వానించామ‌ని సునీత తెలిపారు. రిసెప్ష‌న్ కాకుండా చిన్న చిన్న పార్టీల‌ను ఏర్పాటు చేసి త‌మ‌కు కావాల్సిన వారిని క‌లుస్తామ‌ని చెప్పారు. ఆ త‌ర్వాత‌నే హ‌నీమూన్ ఆలోచ‌న చేస్తామ‌ని, ఇప్పుడు ఆ ఆలోచ‌న ఏమీ లేద‌ని సునీత తెలిపారు.

Related News