logo

  BREAKING NEWS

క‌రోనా వ్యాక్సిన్ కావాలంటే బీజేపీకే ఓటేయాలా ?  |   గుడ్ న్యూస్: వ్యాక్సిన్ రిలీజ్ డేట్ చెప్పేసిన భార‌త్ బ‌యోటెక్‌  |   మీ పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ స్థాయి హాస్ట‌ల్‌తో కూడిన‌ విద్య కావాలా  |   RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |  

ఫేస్ బుక్ ఖాతాలో అశ్లీల పోస్టులు.. గాయని స్మిత వివరణ

టాలీవుడ్ గాయని స్మిత కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. సామజిక విషయాలపై ఇటీవల ఎక్కువగా స్పందిస్తున్నారు. కరోనా సంక్షోభంలో ఆమె కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే ఆమె తన ఫేస్ బుక్ ఖాతాను అందుకోసం ఉపయోగించుకుంటున్నారు. ఉన్నట్టుండి ఆమె అకౌంట్ నుంచి అశ్లీల పోస్టులు, నగ్న చిత్రాలు కనిపించడంతో ఆమె ఫాలోవర్లు ఖంగుతిన్నారు.

ఈ విషయం తెలుసుకుని ఆమె కూడా షాకయ్యారట. చివరకు తన అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని తెలుసుకుని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసారు. ఈ విషయాన్నీ ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఇన్ని రోజులుగా తన ఫేస్ బుక్ హ్యాక్ అయ్యిందన్నారు. తన అకౌంట్ నుంచి పిచ్చి పిచ్చి పోస్టులు చేస్తూ వేధించారన్నారు. ఇదొక భ‌యంక‌ర‌మైన రోజు అని కామెంట్ పెట్టారు.

దీనిపై ఎలా స్పందించాలో తెలియక సతమతమయ్యానన్నారు. వాటిని డిలీట్ చేసే ప్రయత్నం చేసినా అవి డిలేట్ అవ్వలేదని వాపోయారు. ప్రస్తుతం ఈ సమస్య తీరిపోయింది. ఇప్పుడు తన ఫేస్ బుక్ యథాతథ స్థితికి వచ్చిందన్నారు. తనకు సహకరించిన టీమ్ అందరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Related News