logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

టీడీపీకి మరో ఎదురు దెబ్బ.. వైసీపీలో చేరిన కీలక నేత!

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీలో చేరారు. ఆయనతో పాటుగా అయన కుమారుడు శిద్దా సుధీర్ కూడా వైసీపీలో చేరారు. తాడేపల్లి గూడెంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన పలువురు మంత్రులతో చర్చలు జరిపారు. అనంతరం తాను వైసీపీలో చేరుతున్నట్టుగా ప్రకటించారు. వీరిద్దరికి జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

టీడీపీలో కీలక నేతగా వ్యవహరించిన శిద్దా.. మంగళవారం టీడీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసారు. పార్టీలో చేరిన అనంతరం శిద్దా రాఘవరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు తనకు నచ్చాయని అందుకే వైసీపీలో చేరినట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Related News