logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి

త‌మిళ‌నాడులో ఇటీవ‌ల తండ్రీకొడుకుల లాక‌ప్ డెత్ సంఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌నే ఆరోప‌ణ‌ల‌తో తూత్తుకూడి జిల్లా స‌త్తాన్‌కులానికి చెందిన మొబైల్ షాప్ నిర్వ‌హాకులైన తండ్రీకొడుకులు జ‌య‌రాజ్‌, బెనిక్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించి చిత్రహింస‌లు పెట్టారు. అవి తాళ‌లేక తండ్రీకొడుకులు ఇద్ద‌రూ లాక‌ప్‌లోనే క‌న్నుమూశారు.

ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడుతో పాటు దేశ‌మంతా సంచ‌ల‌నంగా మారింది. మృతుల కుటుంబాల‌కు న్యాయం జ‌ర‌గాల‌ని, వీరి మ‌ర‌ణానాకి కార‌ణ‌మైన వారికి క‌ఠిన శిక్ష ప‌డాల‌ని ప్ర‌జ‌లంతా గ‌ట్టిగా డిమాండ్ చేశారు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం ఈ ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణకు సైతం ఆదేశించింది. విచార‌ణ కోసం రంగంలోకి దిగిన సీబీఐ లాక‌ప్ డెత్‌కు కార‌కులుగా భావిస్తున్న 10 మంది పోలీసుల‌ను అరెస్టు చేసింది.

ఈ 10 మంది పోలీసుల్లో స్పెష‌ల్ స‌బ్ ఇన్స్‌పెక్ట‌ర్ పాల్‌దురై కూడా ఉన్నాడు. విచార‌ణ కొన‌సాగుతుండ‌గానే పాల్‌దురై క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డాడు. చికిత్స పొందుతూ ఆయ‌న ఇవాళ ఉద‌యం మ‌ర‌ణించాడు. లాకప్‌డెత్ కేసులో శిక్ష ప‌డ‌క‌ముందే మృత్యువు క‌రోనా వైర‌స్ రూపంలో పాల్‌దురైని శిక్షించిన‌ట్లుగా ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.

Related News