logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

బాలీవుడ్ లో ఆఫర్లు రావాలంటే అవన్నీ చేయాల్సిందే: శ్రద్దా

బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం తరువాత చాలా మంది తాము కూడా నేపోటిజం బాధితులమంటూ బయటకు వస్తున్నారు. కొందరు బాలీవుడ్ లో తమకు ఎదురైనా చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నటి శ్రద్దా దాస్ కూడా తన గతానుభవాలను అభిమానులతో పంచుకుంది. బాలీవుడ్ పైకి కనిపించేంత అందంగా ఉండదని అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ లో ఆఫర్లు రావాలన్న, నటిగా ఎదగలనా చాలా చేయాల్సి ఉంటుందట. ముఖ్యంగా జుహు, బాంద్రా వంటి ప్రాంతాల్లో ఉండే ఖరీదైన క్లబ్బుల్లో పార్టీలకు వెళ్ళాలి. ఇష్టం లేకపోయినా అక్కడివారితో సన్నిహితంగా మెలగాలి. లేకపోతే బాలీవుడ్ మనల్ని పట్టించుకోదు. మేల్ యాక్టర్లకు కూడా ఇవే ఇబ్బందులు ఉంటాయి. ఒక వేళ ఆఫర్ల కోసం పీఆర్ మేనేజర్లను నియమించుకున్నా వారు కూడా మనదగ్గర డబ్బులు తీసుకుని క్లబ్బులకు వెళ్లాలని సూచిస్తారు.

అక్కడ జరిగే పార్టీలకు హాజరు కావాలంటే ఖరీదైన దుస్తులు ధరించాలి. ఖరీదైన షూస్, సెలూన్, స్టయిలిస్ట్, పీఆర్, కార్లు ఇలా ప్రతిదీ డబ్బుతో ముడిపడిందే. నటులుగా ఎదగాలని వచ్చే మధ్యతరగతి వారు ఇలాంటి ఖర్చులు భరించలేరు. ఒక్కోసారి ఇలాంటి రంగంలోకి ఎందుకొచ్చామా అనిపిస్తుంది. అంటూ బాలీవుడ్ లో ని చీకటి కోణాలను బయటపెట్టింది. తెలుగులో ‘ఆర్య-2’ సినిమాలో నటించిన శ్రద్దా తర్వాత కొన్ని ఐటెం సాంగ్స్ లో కూడా నటించింది. ఇక్కడ ఆఫర్లు లేకపోవడంతో బాలీవుడ్ కు వెళ్ళింది. అక్కడ కూడా ఆమెకు తగిన గుర్తింపు దక్కలేదు. కాగా ఇటీవల ఆమె చేసిన కొన్ని ఫోటో షూట్ లు వైరల్ గా మారాయి.

Related News