logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

బిగ్ బాస్ అభిమానులకు బాడ్ న్యూస్…

బిగ్ బాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్త్తున్న సమయం దగ్గరపడింది. ప్రేక్షకులను అలరించడానికి అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ చక చకా పనులు పూర్తి చేసుకుంటుంది. అందులో భాగంగా సీజన్ 4కు సంబందించిన కంటెస్టెంట్లను సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే ఈ షోను గతంలో ఎన్నడూ లేని విధంగా తీర్చిదిద్దెందుకు బిగ్ బాస్ యాజమాన్యం ప్లాన్ చేస్తుంది.

ఈ సీజన్ కు సంబంధించి షోను ఎవరు హోస్ట్ చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల విషయంలో మాత్రం రోజుకో పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో హీరోయిన్ శ్రద్ధ దాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. దీంతో బిగ్ బాస్ అభిమానులు పండగా చేసుకున్నారు. తాజాగా ఈ వార్తలపై శ్రద్ధాదాస్ స్పందించింది.

తాను ఎలాంటి బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని తెలిపింది. ఇక మీద నాపై ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది. దీంతో బిగ్ బాస్ లో శ్రద్ధ దాస్ కనువిందు చేస్తుందని భావించిన యువ ప్రేక్షకులంతా ఉసూరుమన్నారు. అప్పట్లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమాలో మెరిసిన శ్రద్ధ తర్వాత ఆఫర్లు లేక బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది.

కానీ ఇటీవల ఆమె చేస్తున్న బోల్డ్ ఫోటో షూట్లతో మాత్రం భారీగా అభిమానులను పోగుచేసుకుంది. దీంతో శ్రద్దా మళ్ళీ బాలీవుడ్ లో బిజీగా మారింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో శ్రద్దా ఆశలకు బ్రేకులు పడ్డట్టైంది. అదే సమయంలో తెలుగు బిగ్ బాస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా అవి కేవలం రూమర్లేన్నాయి తేల్చింది.

Related News