logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

12 ఏళ్ల తర్వాత సానియాతో పెళ్లిపై స్పందించిన పాక్ క్రికెటర్

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వివాహం పై తీవ్ర నిరసనలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. అన్ని అవాంతరాలను దాటుకుని 2008 లో హైదరాబాద్ వేదికగా వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. వీరిద్దరికి రెండేళ్ల కింద ఇజాన్ జన్మించాడు. అయితే భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రతిసారి ఈ దంపతులు తీవ్ర విమర్శలు ఎదుర్కుంటారు. కొందరు నెటిజన్లు అయితే సోనియాను తీవ్రంగా ట్రోల్ చేస్తుంటారు.

తాజాగా భార్య పిల్లలను చూసుకోవడం కోసం షోయబ్ ఆటకు కొంత విరామం ప్రకటించి భారత్ కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా సానియాతో వివాహంపై షోయబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. తమ పెళ్లి జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా ఈ విషయంపై ఇప్పటికీ కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. అయితే ఇన్నేళ్ళలో సానియాను పెళ్లి చేసుకోవడంపై ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదు. అయినా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు వారు ఎక్కడి నుంచి వచ్చారు.. ఆ దేశంతో మనకి మంచి సంబంధాలు ఉన్నాయా లేదా అనే విషయాలు పట్టించుకోము.

అలాంటి అవసరం కూడా లేదు. ఒకరికి ఒకరు నచ్చామా? అర్థం చేసుకున్నామా?ఇరు కుటుంబాలు ఒపుకున్నాయా అనే విషయాలు మాత్రమే ఆలోచించాలి. భారత్ లో నాకు చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు. రెండు దేశాల సంబంధాలపై ఎప్పుడూ ఆందోళన చెందలేదు. ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిని కాదు క్రికెటర్ ను మాత్రమే అని షోయబ్ చెప్పుకొచ్చారు.

Related News