logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

షాకిస్తున్న లెక్కలు.. హిందూమతంలోకి 47 శాతం మంది.. ఆ మతస్థులే ఎక్కువ

ఎక్కడైనా హిందువులు వేరే మతాల్లోకి మారుతుండటం చూస్తుంటాం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కేరళ రాష్ట్రంలో తాజాగా బయటపడిన లెక్కలు షాకిస్తున్నాయి. కేరళ లో ఏ పౌరుడైన వేరే మతాన్ని స్వీకరించాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ గెజిట్ లో ఆ విషయాన్ని తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2020 కు సంబందించిన ప్రభుత్వ గెజిట్ లోని వివరాల ప్రకారం. .. గతేడాది ఏకంగా 47 శాతం మంది హిందూ మతంలోకి మారారు.

ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే. క్రైస్తవ మత ప్రాబల్యం అధికంగా ఉండే ఈ రాష్ట్రంలో ముస్లిం మతస్తులు కూడా అదే స్థాయిలో ఉంటారు. ఈ రాష్ట్రం లో 506 మత మార్పిడులు నమోదయ్యాయి. అందులో 241 మంది ఇస్లాం, క్రిస్టియన్ మతాల నుంచి హిందూ మతంలోకి వచ్చారు. ఇలా హిందువులుగా మారిన వారిలో అత్యధికులు క్రైస్తవ మతానికి చెందిన వారే ఉండటం విశేషం.

దేశంలోనే అత్యధిక శాతంగా ఉన్న హిందూ మతస్థులు వేరే మతాలకు ఆకర్షితులు కావడం, మతం మార్చుకోవడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయమే. అయితే హిందూ మతంలో మాత్రం ఈ విధంగా జరగడం చాలా అరుదనే చెప్పుకోవాలి. హిందూ సమాజంలోని మత గురువులు మత మార్పిడులను ప్రోత్సహించకపోవడం కూడా అందుకు కారణం కావచ్చు. కానీ తాజాగా చోటుచేసుకున్న పరిణామం ఊహించని విధంగా ఉంది.

ఇటీవల కేరళ శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మత మార్పిడులను నిరోధించే విధంగా బిల్లు తెస్తామని బీజేపీ ప్రకటించింది. ఇతర మతస్థులను బలవంతంగా మతం మార్చడం, మతం మార్చడం కోసమే పెళ్లి చేసుకోవడం లాంటివి నిరోధిస్తామని మానిఫెస్టోలో పేర్కొంది. అయితే కేరళ రాష్ట్రంలో మాత్రం ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా మారడం విశేషం.

Related News