logo

  BREAKING NEWS

జ‌గ‌న్ షాకింగ్ నిర్ణ‌యం.. ఇద్ద‌రు తెలంగాణ వాళ్ల‌కు రాజ్య‌స‌భ సీటు  |   ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |  

జూమ్ యాప్ వినియోగదారులకు పిడుగులాంటి వార్త

దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ విధించడంతో ఆన్ లైన్ మీటింగ్ లకు, ముఖ్యమైన కాన్ఫరెన్సులకు జూమ్ యాప్ ను వినియోగించే వారి సంఖ్య అధికమైంది. మరోవైపు విద్యా సంస్థలు కూడా ఈ యాప్ ను వినియోగించే ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. అత్యాధునిక వీడియో సెషన్స్ అందిస్తున్న ఏకైక యాప్ గా ఈ అమెరికా యాప్ నిలిచింది.

అయితే ఇది ఫ్రీ యాప్ కావడంతో ప్రతి ఒకరు యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని వాడుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో గతం లో ఎన్నడూ లేనన్ని లాభాలు ఆర్జించామని జూమ్ యాప్ సంస్థ పేర్కొంది. అయితే ఇంతలోనే ఈ యాప్ యూజర్లకు షాకిచ్చింది. ఇప్పటివరకు నయా పైసా ఖర్చు లేకుండా వినియోగిస్తున్న యూజర్లు ఇకపై జూమ్ యాప్ ను వాడాలంటే రీచార్జి చేసుకోవలసి ఉంటుందని బాంబు పేల్చింది.

జూమ్ యాప్ వినియోగదారుల వ్యక్తిగత భద్రతను దృష్టిలో పెట్టుకుని యాప్ ను కొత్త టెక్నాలజీతో అప్ గ్రేడ్ చేశామని అందుకు త్వరలోనే ఎఫ్‌‌బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) తో కలిసి పనిచేయనున్నామని అందువల్ల ఉచిత సర్వీసులను అందించలేమని సంస్థ సీఈవో ఎరిక్ యాన్ ప్రకటించారు. ఉచితంగా యాప్ సేవలను అందించడం వలన యాప్ ను దుర్వినియోగపరిచే అవకాశం ఉందని, ఇప్పుడు కొత్త అప్ గ్రేడెడ్ వర్షన్ లో మరిన్ని కొత్త సదుపాయాలను పొందుపరిచామని తెలిపారు. అందువల్ల ఇకపై వీడియో సెషన్స్ మరింత అద్భుతంగా జరుగుతాయని వివరించింది.

Related News