logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

గుడ్డు తినేవారందరికీ షాకిస్తున్న వార్త..!

పోషకాహారలేమితో బాధపడేవారు ప్రతి రోజు ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తారు. ఇందులో ఉండే పోషకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో శుక్రవారం ‘వరల్డ్ ఎగ్ డే’ ను కూడా నిర్వహిస్తుంటారు. శరీరానికి అవసరమైన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. తక్కువ క్యాలరీలతో ఎక్కవ శక్తిని ఇస్తుంది కాబట్టి బరువు కూడా పెరిగారు. కంటిలో శుక్లాలను వచ్చే సమస్యను తగ్గిస్తాయి. కొంతమంది గుడ్డు తినడం వలన గుండె జబ్బులు వస్తాయని నమ్ముతారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే.

గుడ్డు తినేవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్కు 46 శాతం తగ్గినట్టుగా రుజువైంది. శరీరంలోని ప్రతి భాగంపై ఇందులో ఉండే పోషకాలు పనిచేస్తాయి. అయితే ఎంత పోషకాహారమైనా ఎక్కువగా తింటే ప్రమాదకరమే అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా చైనా మెడికల్ యూనివర్సిటీ ఖతార్ యూనివర్సిటీకు చెందిన పరిశోధకులు ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో రోజుకి ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినే వారు డయాబెటీస్ బారిన పడుతున్నట్టుగా గుర్తించారు.

1991 నుంచి 2009 మధ్య కాలంలో గుడ్లను అధికంగా తినేవారి డేటాను పరిశీలించిన అనంతరం వీరిలో మధుమేహం వచ్చే అవకాశాలు 60 శాతం అధికంగా ఉన్నట్టుగా వెల్లడించారు. అందుకే ఈ పౌష్టికాహారాన్ని మితంగా తినాలని సూచిస్తున్నారు. అంతే కాదు గుడ్డును సరైన మోతాదులో తీసుకోకపోవడం వలన ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. గుడ్లను ఉడికించినప్పుడు అందులోని బాక్టీరియా పూర్తిగా నశించాలి. పూర్తిగా ఉడకపెట్టకపోవడం వలన వాటిలో ఉండే బాక్టీరియా శరీరానికి హాని చేస్తుంది.

పచ్చి గుడ్డును తినడం బలం అని నమ్మేవారు కూడా ఉన్నారు. కానీ అందులో ఉండే ఎవిడిన్‌ అనే గ్లైకో ప్రోటీన్ శరీరానికి బి విటమిన్ ను అందకుండా అడ్డుపడుతుంది. కొలెస్ట్రాల్ జబ్బులతో బాధపడేవారు, టైపు 2 మధుమేహంతో బాధపడేవారు కూడా గుడ్డును తీసుకోకూడదు. అది వారి సమస్యను మరింత ఎక్కువ చేస్తుందని వెల్లడైంది. కొన్ని యాంటీ బయోటిక్స్ వాడే వారు గుడ్డు లోని పోషకాలను వారి శరీరం గ్రహించదు. అలాగే ఫుడ్ ఎలర్జీ ఉన్నవారు కూడా ఈ ఆహారానికి దూరంగా ఉండటం మేలు.

 

Related News