logo

  BREAKING NEWS

సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |   బ్రేకింగ్: ఎన్నికలపై సుప్రీం తీర్పు: నిమ్మగడ్డ సంచలన నిర్ణయం!  |   బిగ్ బ్రేకింగ్: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కీలక తీర్పు!  |   సిక్కిం సరిహద్దుల్లో చైనా దుస్సాహసం.. బుద్ధి చెప్పిన సైనికులు  |   చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |   పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?  |   మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?  |   వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!  |   బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |  

బీజేపీకి ఊహించని షాక్.. పార్టీకి కీలక నేత రాజీనామా!

తెలంగాణ బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వరుస విజయాలతో బీజేపీ ఊపుమీదుంది. మొన్న దుబ్బాకలో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసింది ఆ పార్టీ. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది.

తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న బండి సంజయ్ మాజీ ఛైర్మెన్ స్వామి గౌడ్ ను పార్టలోకి ఆహ్వానించారు. అలాగే ఇటీవల తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా పేరున్న విజయశాంతిని కూడా పార్టీలో కలుపుకున్నారు. మరికొంత మంది నేతలను కూడా పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా ప్రస్తుతం బండి సంజయ్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

బండి సంజయ్ జిల్లాలో పర్యటిస్తున్న సమయంలోనే ఆ జిల్లా అధ్యక్షుడు పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆ పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అయితే ఎర్ర శేఖర్ రాజీనామాకు సంబందించిన ఓ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బండి సంజయ్ పర్యటన సందర్భంగా ఓ వివాదం తలెత్తిందని ఆ కారణంగానే ఎర్ర శేఖర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టుగా సమాచారం అందుతుంది. నారాయణపేట సభకు వెళ్తున్న బండి సంజయ్ ను కలిసిన ఎర్ర శేఖర్ తన రాజీనామా లేఖను అందజేశారు.

Related News