logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

రేవంత్ కు భారీ షాక్: టీపీసీసీ చీఫ్ గా ఆ మాజీ మంత్రి?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదవికి అధ్యక్ష పదవి రేసులో తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉందన్న విషయం తెలిసిందే. ఇక ఈ పదవికి ఆయనపేరు దాదాపుగా ఖరారైందని ప్రచార జరుగుతున్న సమయంలో కాగా ఇప్పటికే రేవంత్ రెడ్డి తనకు టీపీసీసీ పదవిపై ఆసక్తి లేదని చెప్పి మరో షాకిచ్చారు. తాను ప్రచార కమిటీ బాధ్యతలనైతే సమర్థవంతంగా నిర్వహించగలుగుతానని ఓ ఇంటర్వ్యూలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

తాజాగా రేవంత్ వర్గానికి భారీ షాక్ తగిలినట్టు తెలుస్తుంది. అనూహ్యంగా టీపీసీసీ పదవికి అధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్న జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. రేవంత్ పై అధిష్టానం ముందుగా ఆసక్తి చూపినా.. పార్టీలో సీనియర్ నేతలను విస్మరిస్తున్నారంటూ సీనియర్ నేతలు విహెచ్ తో పాటుగా మరికొందరు నేతలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తికి పదవి ఇవ్వడం ఏమిటని మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డికి ఆ పదవి ఇస్తే పార్టీకి రాజీనామా చేస్తామంటూ పలువురు సీనియర్ నేతలు హెచ్చరికలు కూడా జారీ చేసారు. ఈ నేపథ్యంలో పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను సంతృప్తి పరిచేలాగా అన్ని వర్గాలకు అనుకూలుడైన జీవన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇప్పటికే అధిష్టానం షేల్డ్ కవరులో అధ్యక్ష పదవిని చేపట్టే నేత పేరు ఉంచిందని ఈరోజే పీసీసీ చీఫ్ ను ప్రకటించనున్నట్టుగా తెలుస్తుంది.

Related News